Asianet News TeluguAsianet News Telugu

కీపింగ్ చేస్తూ మొద్దు నిద్ర.. క్యాచుల మీద దృష్టి పెట్టడు.. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ పై గిల్ క్రిస్ట్ కామెంట్స్

Australia Vs England: యాషెస్ సిరీస్ లో భాగంగా రెండో టెస్టు తొలి రోజు ఆటలో రెండు క్యాచులు మిస్ చేయడంతో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ పై ఆసీస్ లెజెండరీ ఆటగాడు ఆడమ్ గిల్ క్రిస్ట్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వికెట్ల వెనుక మొద్దు నిద్ర వీడటం లేదని గిల్లీ ఫైర్ అయ్యాడు. 

England Wicket Keepers Have a lazy technique, They not suit For Australia Conditions, Adam gilchrist Comments on Jos Buttler
Author
Hyderabad, First Published Dec 17, 2021, 11:46 AM IST

ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజులో ఇంగ్లీష్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ పై ఆసీస్ మాజీ ఆటగాడు ఆడమ్ గిల్ క్రిస్ట్ సంచలన  వ్యాఖ్యలు చేశాడు. అతడు వికెట్ల వెనుక చాలా నిర్లక్ష్యంగా కనిపిస్తున్నాడని, క్యాచుల మీద దృష్టి పెట్టడం లేదని గిల్లీ వ్యాఖ్యానించాడు. రెండో టెస్టులో తొలి రోజున బట్లర్.. మార్కస్ హారిస్ క్యాచ్ ను అద్భుతంగా అందుకున్నా తర్వాత మార్నస్ లబూషేన్ ఇచ్చిన రెండు ఈజీ క్యాచులు డ్రాప్ చేసిన  నేపథ్యంలో గిల్ క్రిస్ట్ స్పందించాడు. 

గిల్లీ మాట్లాడుతూ... ‘అతడు (బట్లర్) మంచి  వ్యక్తి. కానీ ఇంగ్లీష్ క్రికెటర్. కావున మీరు అతడి మీద అంతటి సింపతీని చూపించాల్సిన అవసరం లేదు..’అంటూ  ఇంగ్లాండ్ మీద ఆస్ట్రేలియా ఆటగాళ్లు సహజంగానే ఉండే అసహనాన్ని వెల్లగక్కిన గిల్లీ ఆ తర్వాత.. ‘మార్కస్ హారిస్ క్యాచ్ ను బట్లర్ అద్భుతంగా అందుకున్నాడు. అందులో సందేహామే అక్కర్లేదు..  అది అత్యుత్తమ వికెట్ కీపింగ్ క్యాచులలో ఒకటి..’

 

‘ఇంగ్లీష్ వికెట్ కీపర్ల టెక్నికల్ స్కిల్స్ గురించి గానీ, వారి కీపింగ్ స్టైల్స్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ  వాళ్లు ఆస్ట్రేలియా పరిస్థితులకు మాత్రం సరితూగరు.  మా యువ  వికెట్ కీపర్లతో పోల్చినా కూడా వాళ్ల (ఇంగ్లాండ్) వికెట్ కీపింగ్ టెక్నిక్ చెత్తగా ఉంటుంది. కీపింగ్ చేస్తున్నప్పుడు వాళ్లు చాలా నిర్లక్ష్యంగా కనిపిస్తారు. ఫుట్ మూవ్మెంట్ అస్సలు ఉండదు. క్యాచులు పట్టడంలో మెలుకువలు కూడా సరిగా  ఉండవు... 

అతడి (బట్లర్) టెక్నిక్ ఏదైతేనేం గానీ ఆట మొదటి రోజు హారిస్ క్యాచ్ లో  అది బాగా పని చేసింది. క్రికెట్ చూసే ప్రేక్షకుల్లో కొంత మంది నిద్రపోతున్నారని నేను అనుకుంటున్నాను. వాళ్లను చూసి బట్లర్ కూడా నిద్రపోయి ఉండవచ్చు. మీరు స్పష్టంగా చూస్తే అతడు వదిలేసిన రెండు  క్యాచులకు ముందు అతడు అంత చురుకుగా లేడు..’ అని గిల్లీ  వ్యాఖ్యానించాడు. 

ఆసీస్ ఇన్నింగ్స్ లో   8వ ఓవర్లో  హారిస్  ఇచ్చిన క్యాచ్ ను ముందుకు దూకుతూ అద్భుతంగా డైవ్ చేస్తూ పట్టిన  బట్లర్..  ఆ తర్వాత లబూషేన్ ఇచ్చిన రెండు క్యాచులను నేలపాలు చేశాడు.తనకు రెండు లైఫ్ లు రావడంతో లబూషేన్ రెచ్చిపోయి ఆడాడు. 20 వ టెస్టు ఆడుతున్న లబూషేన్.. తన కెరీర్ లో ఆరో సెంచరీ నమోదు చేసుకున్నాడు. 305 బంతులాడిన అతడు.. 103 పరుగులు చేసి రాబిన్సన్  బౌలింగ్ లో  ఎల్బీడబ్ల్యూ గా వెనుదిరిగాడు. లబూషేన్ కు ఇది తొలి యాషెస్  సెంచరీ కావడం విశేషం. 

 

ఇక  తొలి రోజు నిలకడగా ఆడిన ఆసీస్.. రెండో రోజు ఫస్ట్ సెషన్ లోనే 3 వికెట్లు కోల్పోయింది.  లబూషేన్ తో పాటు  తొలి టెస్టులో సెంచరీ హీరో ట్రావిస్ హెడ్ (18), కామరాన్ గ్రీన్ (2) వెంటవెంటనే ఔటయ్యారు. ప్రస్తుతం స్టీవ్ స్మిత్ (55 బ్యాటింగ్), అలెక్స్ క్యారీ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios