Asianet News TeluguAsianet News Telugu

బుమ్రా, షమీ అదరగొట్టారు.. విజయంపై విరాట్ కోహ్లీ

ఈ విజయంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించారు. ఈ మ్యాచ్ ఏమౌతుందో నని కొంచెం టెన్షన్ గా అనిపించిందని.. కానీ.. మ్యాచ్ పూర్తి చేయడానికి చాలా మోటివేషన్ దక్కిందని కోహ్లీ పేర్కొన్నాడు

England vs India: "Tension On The Field" Motivated India To Lord's Test Win, Says Virat Kohli
Author
Hyderabad, First Published Aug 17, 2021, 9:17 AM IST

రెండో టెస్టులో టీమిండియా అదరగొట్టింది. ముఖంగా ఆఖరిరోజు మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ రేపింది. దాదాపు 151 పరుగుల తేడాతో.. టీమిండియాకు విజయం సొంతమైంది.  ఈ మ్యాచ్ గెలిచి సీరిస్ లో 1-0 ఆధిక్యంలోకి టీమిండియా దూసుకెళ్లింది. అందరూ మ్యాచ్ డ్రా అవుతుంది లేదంటే.. ఇంగ్లాండ్ వశం అవుతుందని అనుకున్నారు. టీమిండియా మ్యాచ్ కూడా అలానే ఆడింది. సోమవారం ఓవర్ నైట్ స్కోర్ 181/6 తో రెండో ఇన్నింగ్స్ ని భారత్ కొనసాగించింది.. దీంతో.. దానిని చేధించడానికి ప్రత్యర్థి ఇంగ్లాండ్ జట్టు తిప్పలు పడాల్సి వచ్చింది. చివరకు.. విజయం భారత్ కే దక్కింది.

కాగా.. ఈ విజయంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించారు. ఈ మ్యాచ్ ఏమౌతుందో నని కొంచెం టెన్షన్ గా అనిపించిందని.. కానీ.. మ్యాచ్ పూర్తి చేయడానికి చాలా మోటివేషన్ దక్కిందని కోహ్లీ పేర్కొన్నాడు.

ఈ మ్యాచ్ గెలవడం పట్ల చాలా గర్వంగా ఉందన్నాడు. మొత్తం జట్టును చూసి తాను గర్వపడుతున్నానని చెప్పాడు. బ్యాటింగ్ ఫర్మార్మెన్స్.. తాము చాలా బాగా ప్రదర్శించామని చెప్పాడు. అయితే.. మొదటి మూడు రోజులు పిచ్ తమకు పెద్దగా సహకరించలేదన్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం తాము బాగా ఆడగలిగామని చెప్పాడు. అంత ఎక్కువ ఒత్తిడిలోనూ.. జస్ప్రిత్ బుమ్రా, షమీ అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టారని కోహ్లీ పేర్కొన్నాడు. 

‘మేము ఒక టెస్ట్ టీమ్‌గా అత్యంత విజయవంతమైనప్పుడు, మా లోయర్ ఆర్డర్ కూడా మాకు సహాయ పడుతుంది. , మేము ఇంటి నుండి కొంచెం దూరంగా వెళ్లిపోయాము కానీ మా కోచ్ లతో కలిసి కష్టపడుతున్నాం. జట్టుకోసం ఏదైనా చేయాలనే కసి మాలో ఉంటుంది.’ అని కోహ్లీ పేర్కొన్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios