England cricket team: గత నెలలోనే ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు టెస్ట్ కెప్టెన్‌గా ఎంపికైన బెన్ స్టోక్స్ ప్రస్తుతం కౌంటీ ఛాంపియన్‌షిప్‌కు సిద్ధమవుతున్నాడు. తాజాగా జరిగిన మ్యాచ్ లో పరుగుల సునామీ సృష్టించాడు.
Ben Stokes world record century: ధనాధన్ ఫార్మట్ టీ20 వచ్చాక క్రికెట్ రూపురేఖలు మారిపోయాయి. ఆటగాళ్లు ఫార్మాట్ తో సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తున్నారు. టెస్టు క్రికెట్ లోనూ మెరుపులు మెరిపిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కౌంటీ క్రికెట్ లో తన సునామీ ఇన్నింగ్స్ తో సరికొత్త రికార్డులు నెలకోల్పాడు. కౌంటీ క్రికెట్ లో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ.. కేవలం 64 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. బెన్‌స్టోక్స్ ఇన్నింగ్స్ లో ఒకే ఓవర్ లో 6,6,6,6,6,4 పరుగుల సునామీ సృష్టిస్తూ.. మొత్తం 34 పరుగులు రాబట్టాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో వర్సెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో డర్హామ్ తరఫున 64 బంతుల్లో సెంచరీ చేశాడు. బెన్‌స్టోక్స్ వీరవిహారంతో డర్హమ్ ఆరు వికెట్ల నష్టానికి 580 పరుగుల భారీ స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
బెన్ స్టోక్స్ ఈ ఇన్నింగ్స్ లో కేవలం 88 బంతుల్లోనే 161 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్ లో ఏకంగా 17 సిక్సర్లు ఉండటం విశేషం. దీంతో.. కౌంటీ క్రికెట్ లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. కౌంటీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు (17) బాదిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. వోర్సెస్టర్‌షైర్ టీమ్‌తో న్యూరోడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో నెం.6లో బ్యాటింగ్‌కి వెళ్లిన బెన్‌స్టోక్స్.. క్రీజులో కుదురుకునేందుకు చాలా సమయం తీసుకున్నాడు. దాంతో.. హాఫ్ సెంచరీ మార్క్‌ని అందుకునేందుకు 47 బంతుల్ని తీసుకున్న బెన్‌స్టోక్స్.. ఆ తర్వాత కేవలం 17 బంతుల్లోనే 50 పరుగులు చేయడం గమనార్హం. స్పిన్నర్ జోష్ బాకర్ బౌలింగ్‌లో ఆకాశమే హద్దుగా బెన్‌స్టోక్స్ చెలరేగిపోయి.. బౌలర్ కు చుక్కలు చూపించాడు. తొలి ఐదు బంతుల్నీ సిక్సర్లుగా మలిచిన బెన్‌స్టోక్స్.. ఆఖరి బంతికి ఫోర్ కొట్టాడు. దాంతో ఈ ఒక్క ఓవర్ లోనే 34 పరుగులు వచ్చాయి. అతని వ్యక్తిగత స్కోరు 94 పరుగుల వద్ద కూడా బెన్‌స్టోక్స్ సిక్స్ బాదడం విశేషం.
రోజు మూడో ఓవర్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన గంటన్నర లోపే 74 బంతుల్లో 131 పరుగులు చేశాడు. లంచ్ సమయానికి, అతను 82 బంతుల్లో ఎనిమిది ఫోర్లు మరియు 15 సిక్సర్లతో తన స్కోరును 147 పరుగులకు చేరుకున్నాడు. డర్హామ్ తరఫున ఎఫ్‌సి క్రికెట్‌లో స్టోక్స్ సెంచరీ అత్యంత వేగవంతమైనది. అతను 59 బంతుల్లో 70 పరుగుల వద్ద ఉన్నాడు.. 18 ఏళ్ల జోష్ బేకర్ 117వ ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు.. అందులో స్టోక్స్ 6, 6, 6, 6, 6, 4 పరుగులతో సెంచరీకి చేరుకున్నాడు. కాగా, గత నెలలో కెప్టెన్ గా జో రూట్ వైదొలగాలని నిర్ణయించుకోవడంతో స్టోక్స్‌ను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు టెస్ట్ కెప్టెన్‌గా బెన్ స్టోక్స్ ను నియమించింది. జూన్‌లో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు బెన్‌స్టోక్స్ సారథ్యంలో ఇంగ్లాండ్ ఆడనుంది.
