Asianet News TeluguAsianet News Telugu

గల్లీ క్రికెట్ కంటే దారుణంగా... కౌంటీ క్రికెట్‌లో చెత్త రికార్డు... 2 పరుగులకే ఆలౌట్, 10 మంది డకౌట్...

హంటింగ్‌డన్‌షైర్ కౌంటీ లీగ్‌లో బక్డెన్ క్రికెట్ క్లబ్, ఫాల్కన్ జట్ల మధ్య వన్డే మ్యాచ్‌లో దారుణమైన రికార్డు... 

8.3 ఓవర్లలో 2 పరుగులకే ఆలౌట్ అయిన టీమ్... 10కి 10 మంది డకౌట్...

England County Team All-out for just 2 Runs, all batsman failed to score single run CRA
Author
India, First Published Jun 22, 2021, 6:03 PM IST

11 మంది ప్లేయర్లు ఉన్న టీమ్‌, ఎంత పర్ఫామెన్స్ ఇచ్చినా కనీసం రెండంకెల్ స్కోరు అయినా దాటుతుంది. గల్లీ క్రికెట్ కంటే దారుణంగా రెండు, రెండంటే రెండే పరుగులకి ఆలౌట్ అయింది ఓ జట్టు. ఇది ఏ కాలనీ క్రికెట్‌లోనే, లేక స్కూల్ గేమ్‌లోనో జరిగింది కాదు. క్రికెట్‌కి పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్‌లో...

హంటింగ్‌డన్‌షైర్ కౌంటీ లీగ్‌లో బక్డెన్ క్రికెట్ క్లబ్, ఫాల్కన్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఫాల్కన్ మొదట బ్యాటింగ్ చేసి 6 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. ఆ తర్వాత 261 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన బక్డెన్ క్రికెట్ క్లబ్, 8.3 ఓవర్లలో 2 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

బక్డెన్ జట్టులోని బ్యాట్స్‌మెన్ అందరూ డకౌట్ అయ్యారు. ఆ జట్టుకి వచ్చిన రెండు పరుగులు కూడా వైడ్ రూపంలో ఒకటి, బై రూపంలో ఒకటి వచ్చాయి. అయితే ఈ మ్యాచ్‌లో మెయిన్ జట్టు ప్లేయర్లు అంతా వివిధ కారణాలతో బరిలో దిగకపోవడంతో అప్పటికప్పుడు రెండో జట్టుతో బరిలో దిగడం వల్లే ఇలా జరిగిందని తెలియచేశారు బక్డెన్ టీమ్ మేనేజ్‌మెంట్...

Follow Us:
Download App:
  • android
  • ios