ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ తండ్రి గెరార్డ్ జేమ్స్ స్టోక్స్ అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అరుదైన బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న బెన్‌స్టోక్స్ తండ్రి వయసు 65 ఏళ్లు. ప్రతీ మ్యాచ్‌లో వికెట్లు తీసినా, సెంచరీ చేసినా చేతులతో తండ్రికి అభివాదం చేసేవాడు బెన్‌స్టోక్స్.

క్యాన్సర్‌ బారిన పడిన తండ్రికి తోడుగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌కు దూరంగా ఉన్న బెన్‌స్టోక్స్, పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు. ఐపీఎల్‌ 2020కి కూడా ఆలస్యంగా వచ్చాడు. 

మాజీ రబ్బీ ప్లేయర్ అయిన గెరార్డ్ జేమ్స్ స్టోక్స్... జనవరిలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న గెరార్డ్ జేమ్స్... వెళ్లి క్రికెట్ ఆడమని చెప్పాడని, అందుకే ఐపీఎల్‌కి వచ్చానని చెప్పాడు బెన్‌స్టోక్స్.