రమీజ్‌రాజా, ఎహ్‌సాన్ మణి ఇద్దరూ ఈనెల 23న ఇమ్రాన్ ఖాన్‌తో భేటీ అయ్యారు. ఆ సందర్భంగానే ఇమ్రాన్‌ ఖాన్‌.. పీసీబీ చైర్మన్‌ పదవికి రమీజ్‌ పేరును ప్రతిపాదించారు. 

పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ( పీసీబీ) నూతన చీఫ్ గా రమీజ్ రాజా నియమితులయ్యారు. ఈయన పాకిస్తాన్ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సన్నిహితుడు కావడం గమనార్హం. పాక్‌ ప్రధానే స్వయంగా రంగంలోకి దిగి తన మాజీ సహచరుడిని పీసీబీ బాస్‌గా నియమించడం గమనార్హం.

ప్రస్తుత పీసీబీ చైర్మన్‌ ఎహ్‌సాన్ మణి పదవీకాలం ముగిసిన వెంటనే రమీజ్ రాజా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు పాక్‌ ప్రధాని కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడినట్లు పాక్‌ మీడియా వెల్లడించింది. రమీజ్‌రాజా, ఎహ్‌సాన్ మణి ఇద్దరూ ఈనెల 23న ఇమ్రాన్ ఖాన్‌తో భేటీ అయ్యారు. ఆ సందర్భంగానే ఇమ్రాన్‌ ఖాన్‌.. పీసీబీ చైర్మన్‌ పదవికి రమీజ్‌ పేరును ప్రతిపాదించారు. 

కాగా, రమీజ్ రాజా.. 1984-1997 మధ్య కాలంలో పాక్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 57 టెస్టుల్లో 2833 పరుగులు.. 198 వన్డేల్లో 5851 పరుగులు సాధించాడు. 1992 ప్రపంచకప్‌ గెలిచిన పాక్‌ జట్టులో రమీజ్‌ సభ్యుడు. ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్‌ హయాంలోనే పాక్‌ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే, త్వరలో ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో బాబర్‌ ఆజమ్‌ నేతృత్వంలోని పాక్‌ జట్టు విదేశీ పర్యటనల్లో బిజీగా ఉంది. రెండు రోజుల కిందటే విండీస్‌ పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకుంది.