వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మాజీ అధ్యక్షుడు డేవ్ కామెరూన్ పై ఆ దేశ మాజీ క్రికెటర్ డ్వేన్ బ్రేవో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. తన కెరీర్ అర్థాంతరంగా ముగిసిపోవడానికి అసలు కారణం అతనే అని... చాలా మంది క్రికెట్ కి వీడ్కోలు పలకడానికి కారణం కూడా అతనే అంటూ తీవ్ర విమర్శలు చేశాడు.

2018లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన బ్రేవో కొన్ని నెలల క్రితం బోర్డుకు వచ్చిన కొత్త అధ్యక్షుడు రికీ స్కిరిట్ తోనైనా తమ కెరీర్ మారుతుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే డేవ్ కామెరూన్ పదవీ కాలం ముగిసిపోవడంపై బ్రేవో సంతోషం వ్యక్తం చేశాడు.

Also Read:  గంగూలీ పదవీ కాలం పొడిగించనున్నారా..?

కెమెరూన్ పదవీ కాలం ముగిసిపోవడంతో తమ క్రికెట్ బోర్డుకి మంచి రోజులు వచ్చాయన్నారు. ఎక్కువ కాలం పనిచేసిన కామెరున్ నియంతలా ప్రవర్తించాడని..  బోర్డును  నాశనం చేశాడని మండిపడ్డాడు. అతని కారణంగానే చాలా మంది క్రికెట్ కి వీడ్కోలు పలికారని అన్నారు.

2017లో వెస్టిండీస్ తరపున బ్రేవో చివరి మ్యాచ్ ఆడాడు. కాగా, గతేడాది విండీస్ బోర్డు నిర్ణయాలతో విసుగు చెంది అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికాడు. అయితే... ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్ లో బాగంగా వెస్టిండీస్ రిజర్వ్  ఆటగాళ్లలో బ్రేవోకు స్థానం కల్పించడం గమనార్హం. టెస్టుల్లో 2.200 పరుగలతో పాటు 86వికెట్లు సాధించిన బ్రేవో.. వన్డేల్లో 2,968 పరుగులు సాధించడంతో పాటు 199 వికెట్లు తీశాడు. ఇక అంతర్జాతీయ టీ20ల్లో 1,142 పరుగులు చేయగా 52 వికెట్లు సాధించాడు. 

Also Read:ధోనీ వల్లే ఇదంతా... ఆనందంలో మునిగితేలుతున్న చాహర్ తండ్రి