చెన్నై సూపర్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ..ముంబైపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం...
- Home
- Sports
- Cricket
- IPL 2020 CSK vs MI Match Live Updates: చెన్నై సూపర్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ..ముంబైపై 5 వికెట్ల తేడాతో
IPL 2020 CSK vs MI Match Live Updates: చెన్నై సూపర్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ..ముంబైపై 5 వికెట్ల తేడాతో

క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ మహా సమరం ప్రారంభమైంది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌తో ఐపీఎల్ ప్రారంభం కానుంది. 2014 తర్వాత ఆరేళ్లకు పూర్తి ఐపీఎల్ సీజన్ దుబాయ్ వేదికగా జరగనుంది. అబుదాబిలోని షేక్ జావెద్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఓపెనర్‌గా రీఎంట్రీ ఇస్తుంటే, మహేంద్ర సింగ్ ధోనీ ఏడాదిన్నర తర్వాత క్రీజులోకి దిగుతున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ..ముంబైపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం...
చెన్నై విజయం లాంఛనమే... ధోనీ నాటౌట్...
చెన్నై విజయం లాంఛనమే... ధోనీ డకౌట్... మొదటి బంతికే ధోనీని అవుట్‌గా ప్రకటించిన అంపైర్.. రివ్యూ కోరిన ధోనీ. రివ్యూలో బ్యాటుకి బంతి తగిలినట్టుగా కనిపించకపోవడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు అంపైర్.
ఐదో వికెట్ కోల్పోయిన చెన్నై... క్రీజులోకి ధోనీ...
18 పరుగులు చేసిన సామ్ కుర్రాన్ అవుట్ కావడంతో ఏడాదిన్నర తర్వాత క్రీజులోకి ధోనీ...
క్రీజులోకి రాని మహేంద్ర సింగ్ ధోనీ...
10 పరుగులు చేసి అవుట్ అయిన జడేజా... క్రీజులోకి రాని మహేంద్ర సింగ్ ధోనీ...
అంబటి రాయుడు అవుట్... క్రీజులోకి జడేజా..
అంబటి రాయుడు అవుట్... క్రీజులోకి జడేజా... మూడు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 71 పరుగులు చేసిన అంబటి రాయుడు... మొదటి బంతికే ఫోర్ బాదిన జడేజా..
మూడో వికెట్‌కి 100 పరుగుల భాగస్వామ్యం...
అంబటి రాయుడు, డుప్లిసిస్ మూడో వికెట్‌కి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
13.1 ఓవర్లలో 100 పరుగులు చేసిన చెన్నై...
చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు దిశగా సాగుతోంది. ముంబై బౌలర్లు వికెట్లు తీయడంలో విఫలం కావడంతో చెన్నై 13.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 100 మార్కుని దాటింది.
అంబటి రాయుడి షో..
చాహార్ బౌలింగ్‌లో అంబటి రాయుడు ఓ భారీ సిక్సర్ బాదాడు.
అంబటి రాయుడు హాఫ్ సెంచరీ...
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ అంబటి రాయుడు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 33 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేశాడు రాయుడు.
పది ఓవర్లలో 70 పరుగులు చేసిన చెన్నై
ముంబై ఇండియన్స్ విధించిన 163 పరుగుల లక్ష్యచేధనలో చెన్నై సూపర్ కింగ్స్ 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. ముంబై ఫీల్డింగ్ తప్పిదాలు చెన్నైకి కలిసొస్తున్నాయి.
రాయుడు, డుప్లిసిస్ 50+ భాగస్వామ్యం...
6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కోలుకుంటోంది. అంబటి రాయుడు, డుప్లిసిస్ కలిసి మూడో వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
కోలుకుంటున్న చెన్నై ఇన్నింగ్స్...
బుమ్రా వేసిన ఆరో ఓవర్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 14 పరుగులు రాబట్టింది. దీంతో 6.4 ఓవర్లు ముగిసే సమయానికి 40 పరుగులు రాబట్టింది.
బుమ్రా చేతికి బంతి...
ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ బుమ్రా ఆరో ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చాడు.
5 ఓవర్లకు 23/2...
వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోవడంతో చెన్నై నెమ్మదిగా ఆడుతోంది. 5 ఓవర్లలో 23 పరుగులు చేసింది.
6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన చెన్నై
ప్యాటిన్సన్ బౌలింగ్‌లో మురళీ విజయ్ అవుట్ అయ్యాడు. అంతకుముందు అవుట్ అయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్న విజయ్, తర్వాతి బంతిని కూడా మిస్ అయ్యి పెవిలియన్ చేరాడు. 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది చెన్నై.
మురళీ విజయ్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన చెన్నై
ప్యాటిన్సన్ బౌలింగ్‌లో మురళీ విజయ్ అవుట్ అయ్యాడు. అంతకుముందు అవుట్ అయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్న విజయ్, తర్వాతి బంతిని కూడా మిస్ అయ్యి పెవిలియన్ చేరాడు. 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది చెన్నై.
షేన్ వాట్సన్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన చెన్నై
షేన్ వాట్సన్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన చెన్నై... 4 పరుగులు చేసిన షేన్ వాట్సన్‌ను అవుట్ చేసిన ట్రెంట్ బౌల్ట్...
చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్ 163...
చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్ 163... 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్...
తొమ్మిదో వికెట్ కోల్పోయిన ముంబై
దీపక్ చాహార్ బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్ అవుట్... 11 పరుగులు చేసిన ప్యాటిన్సన్ 8వ వికెట్‌గా పెవిలియన్ చేరాడు.
పొలార్డ్ అవుట్... ఏడో వికెట్ కోల్పోయిన ముంబై...
భారీ షాట్‌కి ప్రయత్నించిన పోలార్డ్ 18 పరుగులకే పెవిలియన్ చేరాడు. 14 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్స్‌తో 18 పరుగులు చేశాడు పోలార్డ్.