Asianet News TeluguAsianet News Telugu

విండీస్‌తో సిరీస్ షెడ్యూల్ ఖరారు.. బ్రాడ్‌కాస్టర్లు వీళ్లే..

IND vs WI: డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన తర్వాత భారత జట్టు   వెస్టిండీస్‌ టూర్‌కు వెళ్లాల్సి ఉంది.  ఇందుకు సంబంధించిన షెడ్యూల్ వివరాలు వెలువడ్డాయి. 

Dominica and Trinidad To Host 2 Tests, Jio cinema Get Digital Rights MSV
Author
First Published Jun 6, 2023, 4:14 PM IST

ఆస్ట్రేలియాతో రేపటి నుంచి  జరుగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్స్ ముగిశాక టీమిండియా మూడు వారాల విరామం తర్వాత వెస్టిండీస్  టూర్‌కు వెళ్లాల్సి ఉంది.  మూడు ఫార్మాట్ల  మ్యాచ్‌లు ఆడేందుకు గాను భారత జట్టు  కరేబియన్ దీవులకు వెళ్లనుంది. జులై రెండో వారం నుంచి ఆగస్టు  రెండో వారం దాకా (నెల రోజుల పాటు) టీమిండియా విండీస్ దీవుల్లోనే గడపనుంది. 

ఈ  మేరకు  టెస్టు, వన్డే, టీ20 షెడ్యూల్ ను కూడా వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కన్ఫర్మ్ చేసింది. ఈ పర్యటనలో భారత జట్టు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 లు ఆడనుంది. ఈ షెడ్యూల్ ను విండీస్ బోర్డు బీసీసీఐకి పంపింది. దీనిపై బీసీసీఐ ఇంకా అంగీకారం తెలపాల్సి ఉంది. 

క్రిక్ బజ్ లో వచ్చిన నివేదిక ప్రకారం.. జులై 12 నుంచి మొదలయ్యే  ఫస్ట్  టెస్టుతో భారత పర్యటన మొదలవుతుంది.  ఈ మేరకు వేదికలను కూడా విండీస్ బోర్డు ఖాయం చేసింది. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం. 

విండీస్ బోర్డు ప్రతిపాదించిన షెడ్యూల్ : 

జులై 12-16 : ఫస్ట్ టెస్టు - డొమినికా 
జులై 20 - 24 : రెండో టెస్టు : ట్రినిడాడ్ 

జులై 27 : ఫస్ట్ వన్డే  - బార్బోడస్ 
జులై  29 : రెండో వన్డే - ట్రినిడాడ్ 
ఆగస్టు 1 : మూడో వన్డే - ట్రినిడాడ్ 

ఆగస్టు 4 : ఫస్ట్ టీ20 - ట్రినిడాడ్ 
ఆగస్టు 6 : రెండో టీ20 - గయానా 
ఆగస్టు 8 : మూడో టీ20 - గయానా 
ఆగస్టు 12 : నాలుగో టీ20 - ఫ్లోరిడా (యూఎస్) 
ఆగస్టు 13 : ఐదో టీ20 - ఫ్లోరిడా 

 

బ్రాడ్‌కాస్టర్లు వీళ్లే : బీసీసీఐతో  ప్రముఖ ఛానెల్ స్టార్  ఒప్పందం  కొద్దిరోజుల క్రితమే ముగిసిన నేపథ్యంలో   ఇండియా - వెస్టిండీస్ మధ్య జరిగే మ్యాచ్ లకు కొత్త బ్రాడ్‌కాస్టర్ రానుంది. ఈ మ్యాచ్ లను టెలివిజన్ లో  చూడాలనుకునేవారికి  బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. డీడీ   స్పోర్ట్స్ లో ఉచితంగా  ఇండియా - వెస్టిండీస్ సిరీస్ ను చూడొచ్చు.  మొబైల్ లో  చూడాలనుకునేవారికి కూడా  జియో తీపి కబురు అందించింది. ఐపీఎల్ మాదిరిగానే విండీస్ సిరీస్ లోని మ్యాచ్ లను జియో సినిమా ఉచితంగా అందిస్తోంది. ఈ మ్యాచ్ లను చూసేందుకు ఏ సబ్‌స్క్రిప్షన్ కూడా అవసరం లేదు.  వాస్తవానికి విండీస్  అధికారిక బ్రాడ్‌కాస్టర్ ‘ఫ్యాన్ కోడ్’ ఉంది. ఇందులో డబ్బులు  పెట్టి సబ్ స్క్రైబ్ చేసుకుంటేనే  మ్యాచ్ చూసే అవకాశం ఉంటుంది. గతేడాది భారత జట్టు విండీస్ టూర్ లో అభిమానులు ఇబ్బందులు ఎదుర్కున్న నేపథ్యంలో బీసీసీఐ ఈసారి తగు జాగ్రత్తలు తీసుకున్నది.  

Follow Us:
Download App:
  • android
  • ios