ఇండియన్ క్రికెటర్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. మొన్నటి దాకా కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. కాగా..  ఇప్పుడిప్పుడే అందరూ మళ్లీ సాధారణ జీవితానికి అలవాటు పడుతున్నారు. ఈ క్రమంలో సచిన్ టెండుల్కర్ తన ఫ్యామిలీతో కలిసి  వెకేషన్ కి చెక్కేశారు.

అక్కడ సముద్రం మధ్యలో ప్రయాణిస్తూ.. కూతురితో కలిసి దిగిన సెల్ఫీలను పోస్టు చేశారు. ఇటీవల సచిన్  పారాసైలింగ్ చేస్తున్న వీడియో షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. 

సచిన్ తన పారాసైలింగ్  చేస్తున్న వీడియోను పోస్ట్ చేస్తూ "హమ్ తో ఉడ్ గయే" (మేం ఎగురుతున్నాం) అన్న క్యాప్షన్ ఇచ్చారు. తన కుమారుడు అర్జున్ తో కలిసి ఉన్న ఫొటో కూడా పోస్ట్ చేసిన సచిన్ 'వెకేషన్ వైబ్స్' అంటూ పెట్టిన ఇన్ స్టా ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. మరో వీడియోలో సైక్లింగ్చేస్తూ కనిపించిన సచిన్ తన ఫ్యాన్స్ కు ఎప్పటికప్పుడు వెకేషన్ హైలైట్స్ ను అప్ డేట్ చేస్తున్నారు. 

తాజాగా.. మరో పోస్టు చేశారు. తన ముద్దుల కూతురు సారా తో కలిసి దిగిన సెల్ఫీని షేర్ చేశారు. అందులో సచిన్, సారా లు.. లైఫ్ జాకెట్ వేసుకొని.. కళ్లకు గ్లాసెస్ పెట్టుకొని స్టైలిష్ గా ఉన్నారు. వారిద్దరి  మధ్య జరిగిన సంభాషణను కూడా సచిన్ ఆ ఫోటోకి క్యాప్షన్ గా పెట్టడం గమనార్హం. కాగా.. ఈ ఫోటోలకు విపరీతంగా లైకులు వచ్చి పడుతున్నాయి. అభిమానులు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.