స‌చిన్ టెండూల్క‌ర్, బ్రియాన్ లారా కంటే గొప్ప క్రికెటర్.. !

The Greatest Cricketer : క్రికెట్ ప్ర‌పంచంలో సచిన్ టెండూల్క‌ర్, బ్రియాన్ లారాలు లెజెండ‌రీ క్రికెట‌ర్లు. క్రికెట్ హిస్ట‌రీ పుస్త‌కంలో వారిది ప్ర‌త్యేక పేజీ. కానీ, వీరిని మించిన క్రికెట‌ర్ ఒక‌రు ఉన్నార‌ని గ్రేట్ వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ లారా షాకింగ్ కామెంట్స్ చేశారు.  
 

Do you know who is a better batter than Sachin Tendulkar and Brian Lara?  Lara: The England Chronicles Book RMA

Best  Cricketer : క్రికెట్ చరిత్రను వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడల్లా ప్రతి ఒక్కరికి ట‌క్కున గుర్తుకు వ‌చ్చే పేరు స‌చిన్ టెండూల్క‌ర్. ఈ లెజెండరీ ప్లేయర్ బ్యాటింగ్‌కు అందరూ వీరాభిమానులు. సచిన్‌ని చూసి ఎదిగిన క్రికెటర్లు నేడు వందల సంఖ్యలో ఉన్నారు. అనేక రికార్డు బ‌ద్ద‌లు కొట్టాడు.. కొత్తగా సృష్టించాడు. 'గాడ్ ఆఫ్ క్రికెట్' గా గుర్తింపు సాదించాడు. అయితే,  సచిన్ టెండూల్కర్ స్నేహితుడు, వెస్టిండీస్ మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా తన రోజుల్లో అతని కంటే, సచిన్ టెండూల్కర్ కంటే బెస్ట్ క్రికెటర్ ఉన్నాడ‌ని బిగ్ కామెంట్స్ చేశాడు.

బ్రియాన్ లారా తన పుస్తకం 'లారా: ది ఇంగ్లాండ్ క్రానికల్స్'లో తన కంటే, సచిన్ టెండూల్కర్ కంటే మెరుగైన బ్యాట్స్‌మెన్ ఎవరు అనే విష‌యాల‌ను ప్ర‌స్తావిస్తూ.. కార్ల్ హూపర్ పేరును చెప్పాడు. గ్రేట్ ఆల్ రౌండర్ కార్ల్ హూపర్ వెస్టిండీస్ తరఫున 102 టెస్టులు, 227 వన్డేలు ఆడాడు. క్రికెట్ లో చాలా రికార్డుల‌నే సృష్టించాడు. టెస్టు క్రికెట్‌లో 5762 పరుగులు, వన్డే క్రికెట్‌లో 5761 పరుగులు చేశాడు. టెస్టుల్లో 114, వన్డేల్లో 193 వికెట్లు తీశాడు.

టీమిండియాకు కొత్త కెప్టెన్ ఎవ‌రు?

కార్ల్ హూపర్ ఎందుకు స‌చిన్, తన కంటే బెస్టు క్రికెటర్ అనే విష‌యాలు ప్ర‌స్తావించిన బ్రియాన్ లారా..  కార్ల్ తన సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకుని ఉంటే అత‌ను టెండూల్కర్ కంటే మెరుగైన బ్యాట్స్‌మెన్‌గా ఉండేవాడని అన్నాడు. "కార్ల్ హూపర్ ఖచ్చితంగా నేను చూసిన అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకడు. టెండూల్కర్, నేను కూడా ఆ ప్రతిభకు దగ్గరగా రాలేమని చెప్ప‌గ‌ల‌ను.. " అని లారా తన కొత్త పుస్తకంలో రాశాడు. అలాగే, వెస్టిండీస్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు కార్ల్ హూపర్ ఎంత గొప్ప ఆటగాడో అనే విష‌యాల‌ను కూడా లారా హైలైట్ చేశాడు.

కార్ల్ హూపర్ గురించి మ‌రింత‌గా ప్ర‌స్తావిస్తూ.. "మేము కార్ల్ హూపర్ కెరీర్‌ను మొత్తంగా చూశాం.. ప్లేయ‌ర్ నుంచి కెప్టెన్సీ వరకు వేరు చేస్తే, అతని గణాంకాలు చాలా భిన్నంగా ఉంటాయి. కెప్టెన్‌గా అతని సగటు 50కి దగ్గరగా ఉంది.. ఈ విష‌యంలో త‌న బాధ్యతను ఎప్పుడు మ‌రువ‌లేదు. అతని నిజమైన సామర్థ్యం గొప్ప క్రికెట‌ర్ ను చేసింది. ఇంకా పూర్తి సామ‌ర్థ్యం ఉప‌యోగించివుంటే ఇప్పుడు చెప్పుకునేది వేరేలా ఉండేది'' అని లారా పేర్కొన్నాడు. కాగా, కార్ల్ హూపర్ 1987లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు, 2003లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. సచిన్ 1989 నుంచి 2013 వరకు అంత‌ర్జాతీయ క్రికెట్ లో కొన‌సాగాడు.

టెస్టు క్రికెట్ లో అత్య‌ధిక వికెట్లు తీసిన టాప్-5 బౌల‌ర్లు వీరే

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios