ధోనీ ఎప్పుడు రిటైర్మెంట్ ఇస్తాడు అని ఎప్పటి నుంచో వస్తున్న ఊహాగానాలకు స్వాతంత్య్ర దినోత్సవం రోజున తెరదించాడు మిస్టర్ కూల్. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన సోషల్ మీడియాలో ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఐపీఎల్ 13వ సీజన్‌లో అద్భుతంగా రాణించి మళ్లీ టీమిండియాలో ఆడుతాడని భావించిన కోట్లాది మంది అభిమానులకు తన నిర్ణయంతో ధోనీ షాకిచ్చాడు. ఆయన రిటైర్మెంట్ ప్రకటించిన క్షణం నుంచి సోషల్ మీడియాలో ధోనీ నామస్మరణతో మారుమోగిపోయింది.

ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండటంతో, ప్రత్యర్ధి జట్లపై వ్యూహ ప్రతివ్యూహాలు పన్నడంలో, ఎక్కడా సంయమనం కోల్పోకుండా మైదానంలో ప్రశాంతంగా జట్టును నడిపించడంలో అతనికి అతనే సాటి. అలా కెప్టెన్సీగా వన్నె తెచ్చిన ధోనీ తీసుకున్న నిర్ణయాల్లో మచ్చుకు ఐదు మీకోసం.

 

 

* 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌ చివరి ఓవర్‌లో పాక్ విజయానికి 13 పరుగులు కావాలి. అప్పటికి మిస్బా వుల్ హక్ 37 పరుగులతో క్రీజులో పాతుకుపోయాడు. ఆ సమయంలో సీనియర్ బౌలర్ హర్భజన్ సింగ్‌ను కాదని ధోనీ బంతిని జోగిందర్ శర్మ చేతికి ఇచ్చాడు.

జోగి వేసిన మొదటి బంతి వైడ్‌గా, రెండోది డాట్ బాల్‌గా పడింది. మూడో బంతిని మిస్బా షార్ట్ ఫైన్ లైగ్‌ మీదుగా బంతిని గాల్లోకి లేపాడు. గ్రౌండ్‌లో ఉన్న వారంతా అది సిక్స్ అని భావించారు. కానీ అక్కడే ఉన్న శ్రీకాంత్ క్యాచ్ పట్టడంతో భారత్ ఖాతాలో తొలి టీ20 ప్రపంచకప్ పడింది. 


గంగూలీ, ద్రవిడ్‌ల తొలగింపు:

 

 

టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత కొద్దిరోజులకే ధోనీ వన్డే కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 2008లో ఆస్ట్రేలియా, శ్రీలంకతో జరిగిన ట్రై సిరీస్‌కు  కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ సమయంలో ధోనీ బీసీసీఐ సెక్రటరీ నిరంజన్ షా దగ్గరకు వెళ్లి ఫీల్డింగ్‌లో సమూల మార్పులకు అవసరం వుందని తెలిపాడు. జట్టులో యువకులు ఉంటే బాగుంటుందని, జట్టులో యువకులు ఉంటే బాగుంటుందని చెప్పాడు. దీంతో పరోక్షంగా టీమిండియా దిగ్గజాలు గంగూలీ, ద్రవిడ్‌ల తొలగింపుకు కారణమయ్యాడు. దీనిపై ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే ధోనీ సేన తొలిసారి ఆసీస్ గడ్డపై ట్రై సిరీస్‌ను గెలిచింది. 


2011 ప్రపంచకప్ ఫైనల్‌లో బ్యాటింగ్‌లో ప్రమోషన్

 

 

2011లో శ్రీలంక నిర్దేశించిన 274 పరుగుల లక్ష్యఛేదనకు భారీలోకి దిగిన భారత్‌కు సచిన్, సెహ్వాగ్, కోహ్లీ ఔటవ్వడం పెద్ద షాకిచ్చింది. ఆ సమయంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న యువరాజ్‌ను కాదని.. ధోనీ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇది కెప్టెన్‌గా ధోనీ తీసుకున్న అత్యంత సాహోసోపేతమైన నిర్ణయం. గంభీర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించడం, యువరాజ్‌తో కలిసి ఆఖిరి వరకు క్రీజులో నిలిచి 91 పరుగులు చేయడం వల్ల 28 ఏల్ల భారత అభిమానుల కల నెరవేరింది. 

ఓపెనర్ల రోటేషన్ పాలసీ:

 

టీమిండియా జట్టులో సచిన్, సెహ్వాగ్ రెగ్యులర్ ఓపెనర్లుగా కొనసాగుతూ ఉండేవారు. వీరి లేనప్పుడు మాత్రమే మరొకరు ఓపెనింగ్ చేసేవారు. అయితే ధోని 2008 సీబీ సిరీస్‌ నుంచి రోటేషన్ పద్దతిని అమలు చేశాడు. ఆ విధంగా సచిన్, సెహ్వాగ్, గంభీర్‌లతో కలిసి రోటేషన్ పద్దతిని పరిచయం చేశాడు. 

రోహిత్ శర్మకు ఓపెనర్‌గా ప్రమోషన్

 

2013 నాటికి ధోనీ విజయవంతమైన కెప్టెన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పటి వరకు మిడిలార్డర్‌లో కొనసాగుతున్న రోహిత్ శర్మను ఓపెనర్‌గా పరిచయం చేశాడు. 2007లోనే టీమిండియాలోకి వచ్చిన హిట్ మ్యాన్.. ఇచ్చిన అవకాశాల్ని వినియోగించుకోలేకపోయాడు. కానీ రోహిత్ శర్మలో అపారమైన ప్రతిభ వుందని కనిపెట్టిన ధోనీ... 2011లో తొలిసారి దక్షిణాఫ్రికా పర్యటనలో ఓపెనర్‌గా ఆడాడు. ఆ సిరిస్‌లో విఫలమైన రోహిత్‌కు మళ్లీ 2013 జనవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో  ధోనీ మరో అవకాశం ఇచ్చాడు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని రోహిత్ ఈసారి నిలబెట్టాడు. 83 పరుగులు చేసి నాటి నుంచి నేటి వరకు మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు.