టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, కేప్టిన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని తన రిటైర్మెంట్ ని ప్రకటించాడు. సోషల్ మీడియా వేదికగా, ఎవరు ఊహించని సమయంలో అందరిని షాక్ కి గురి చేస్తూ తన రిటైర్మెంట్ ని ప్రకటించాడు. 

ధోని రిటైర్మెంట్ తో అభిమానులంతా తీవ్ర నిరాశకు లోనయ్యారు. టి20 వరల్డ్ కప్ లో ధోని ఆడతాడని, ఆ సందర్భంగా ఒక మంచి ఫేర్ వెల్ దక్కుతుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఫేర్వెల్ కూడా దక్కకుండానే ఆయన రిటైర్ అయ్యారు. 

ఇక ధోని రిటైర్మెంట్ చెప్పడంతో అంతా కూడా ధోనికి ఇన్ని సంవత్సరాలుగా తమను అలరించినందుకు ధన్యవాదాలు తెలుపుతూనే ఫ్యామిలీతో సెకండ్ ఇన్నింగ్స్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

ధోని రిటైర్మెంట్ తరువాత ములుగు ఎమ్మెల్యే సీతక్క ధోని ఎందరికో స్ఫూర్తి ప్రదాత అంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసారు. మారుమూల పల్లెటూర్లో పుట్టి శిఖరమంత ఎత్తుకు చేరుకున్న వ్యక్తి ధోని అని, చాలా మందికి ఇది ఇన్స్పిరేషన్ అని అన్నారు. 

"పల్లెటూరులో పుట్టి క్రీడల్లో ఏదో సాధిద్దాం అని కష్టపడుతున్న యువతకి మీ జీవితం ఒక ఆదర్శం ఎంఎస్ ధోని గారు 16 సంవత్సరాలు భారతదేశానికి మీరు ఎన్నో మరచిపోలేని సంతోషకరమైన, మరియు గర్వించదగ్గ సంఘటనలు ఇచ్చారు దానికి మా అందరి తరపున మీకు ధన్యవాదములు... జై హింద్" అని రాసుకొచ్చారు సీతక్క.