ధోని రిటైర్మెంట్ ప్రకటించడం ఒకెత్తయితే... అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ధోని పోస్ట్ చేసిన మెసేజ్ లోని టైం. తాను 19.29 నుండి రిటైర్ అవుతున్నట్టుగా ప్రకటించాడు. 7.29 అని చెప్పకుండా ఇలా 19.29 అని రాయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

టీం ఇండియా అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరైన మహేంద్రసింగ్ ధోని తన క్రికెట్ కెరీర్ కి రిటైర్మెంట్ పలికాడు. ఇంస్టాగ్రామ్ వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఈ వార్తతో ఒక్కసారిగా ధోని ఫాన్స్ అంతా షాక్ కి గురయ్యారు. 

తమ అభిమాన క్రికెటర్ రిటైర్ అవడంతో వారంతా ఇది కల కావాలని కోరుకుంటున్నారు. ఇంకొందరు తమను ఇన్ని రోజులపాటు ఆనంద పరించినందుకు ధన్యవాదాలు తెలుపుతూనే... ఐపీఎల్ ఆక్షన్ లో ధోని కనబడతాడులే అంటూ వారికి వారే సర్ది చెప్పుకుంటున్నారు. 

ధోని తన టెస్టు రిటైర్మెంట్ నిర్ణయాన్ని కూడా ఇదే విధంగా అనూహ్యంగా ఎవరు ఊహించని సమయంలో ప్రకటించాడు. ఇప్పుడు క్రికెట్ కెరీర్ కి కూడా ఈ విధంగానే ముగింపు పలికి మరోసారి అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఈసారి ఏకంగా సోషల్ మీడియా సైట్ లో ప్రకటించాడు తన రిటైర్మెంట్. (బహుశా కరోనా గైడ్ లైన్స్ ఏమో..!)

View post on Instagram

ఇక ధోని రిటైర్మెంట్ ప్రకటించడం ఒకెత్తయితే... అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ధోని పోస్ట్ చేసిన మెసేజ్ లోని టైం. తాను 1929 నుండి రిటైర్ అవుతున్నట్టుగా ప్రకటించాడు. 7.29 అని చెప్పకుండా ఇలా 19.29 అని రాయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 

ధోని రైల్వేస్ తరుఫున ఆడుతూనే అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చాడు. రైల్వేస్ లో టికెట్ కలెక్టర్ గా పనిచేసాడు కూడా. ఆ అనుబంధాన్ని తలుచుకుంటూనే ధోని ఇలా 19.29 అని రైల్వే టైమింగ్ లో తెలిపాడు అని అంటున్నారు. అంతే కాకుండా అర్మీలో సైతం 24 గంటల టైమింగ్ నే వాడుతుంటారు. 

ధోని ఇలా 1929 గా తాను రిటైర్ అవుతున్నట్టు ప్రకటించడం వెనక ఉన్న కారణం ఇదేగా కనబడుతుంది. టైమింగ్ ఏది వాడినా, ఒక శకం మాత్రం ముగిసింది. కనీసం ఐపీఎల్ లో అయినా చూసుకునే భాగ్యం దొరికినట్టవుతుంది.