మహేంద్ర సింగ్ ధోనీ... క్రికెట్ లో ఓ చరిత్ర సృష్టించిన ఆటగాడు. టీమిండియా కెప్టెన్ గా అతడి ప్రస్థానం అద్భుతం. అయితే టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలనుండి తప్పుకున్న తర్వాత తన కెప్టెన్సీ స్కిల్స్ మొత్తం ఐపిఎల్ లో ఉపయోగిస్తున్నాడు. ఇలా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇతడి కెప్టెన్సీలో ఎన్నో విజయాలను అందుకుని అనేకసార్లు ట్రోపిని కూడా ముద్దాడింది. అయితే మరో ఐపిఎల్ ట్రోపిపై కన్నేసిన ధోని సీజన్ 12లో భాగంగా జరుగుతున్న మ్యాచుల్లో తనలోని అత్యుత్తమ కెప్టెన్, బ్యాట్ మెన్, వికెట్ కీపర్ ని అవసరానికి తగ్గట్లుగా వాడుకుంటున్నాడు.

బుధవారం చెన్నై వేదికగా డిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం ధోని తనలోని అన్ని కోణాలను బయటకుతీశాడు. మొదట బ్యాటింగ్ లో రాణించిన ధోని జట్టుకు మంచి స్కోరును అందించారు. ఆ తర్వాత లక్ష్య చేధనకు దిగిన డిల్లీని దెబ్బతీస్తూ ఒకే ఓవర్లో రెండు కళ్లు చెదిరే స్టంపింగ్స్ తో ఇద్దరు కీలక ఆటగాళ్లను పెవిలియన్ కు పంపించి వికెట్ కీపర్ తానేంటో నిరూపించుకున్నాడు. ఇక ధోని కెప్టెన్సీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ధోని మరోసారి చెన్నైకి అద్భుత విజయాన్ని అందించాడు.
180 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన డిల్లీ మొదట్లోనే వరుసగా వికెట్లు కోల్పోగా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్( 44 పరుగులు) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. మెళ్లిగా ఆడుతూ ఒక్కో పరుగును జోడిస్తూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు. అయితే ధోని ముందు అతడి ఆటలు సాగలేవు. జడేజా వేసిన 12 ఓవర్లో ధోని మోరిస్ తో పాటు అయ్యర్ ను కూడా కళ్లుచెదిరే స్టంపౌంట్స్ తో పెవిలియన్ కు పంపించి చెన్నై విజయాన్ని ఖాయం చేశాడు. మొదట మోరిస్ ని జడేజా ఓ అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించగా దాన్ని అంతే చాకచక్యంగా అందుకున్న ధోని రెప్పపాటులో అతన్ని స్టంపౌంట్ చేశాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ ని కూడా అదే తరహాలో స్టంపౌంట్ చేశాడు. ఇలా ధోని వికెట్ల వెనకాల నిల్చుని మాయ చేశాడు.
మ్యాచ్ అనంతరం తన సూపర్ ఫాస్ట్ స్టంపింగ్స్ గురించి ధోని మాట్లాడుతూ... తాను మొదట్లో టెన్నిస్ బాల్ తో క్రికెట్ ఆడటం వల్లే ఇలా అద్భుతమైన స్టపింగ్స్ చేయగలుతున్నానని అన్నాడు. టెన్నిస్ క్రికెట్ ఇప్పటికీ తనకెంతో ఉపయయోగపడుతోందన్నాడు. ముఖ్యంగా అప్పటి బేసిక్స్ ను మరిచిపోకుండా ఇప్పటికీ ఉపయోగిస్తున్నానని...అందువల్లే తన ఆటతీరు అప్పటికి, ఇప్పటికీ ఒకేలా వుందని పేర్కొన్నాడు. తాను ఎంత నేర్చుకున్నా బేసిక్స్ చాలా ముఖ్యమైనవి భావిస్తానని ధోని వెల్లడించాడు.