ముంబై: న్యూజిలాండ్ తో సిరీస్ కు ఓపెనర్ శిఖర్ ధావన్ అందుబాటులో ఉండకపోవచ్చు. న్యూజిలాండ్ తో జరిగే టీ20, వన్డే సిరీస్ లకు అతను దూరమవుతున్నట్లు ముంబై మిర్రర్ రాసింది. అతని స్థానంలో జట్టులోకి ఎవరు వస్తారనే విషయం ఇంకా స్పష్టం కాలేదు.

ఆస్ట్రేలియాతో జరిగిన ముడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ శిఖర్ ధావన్ గాయపడ్డాడు. అతని భుజానికి గాయమైంది. ఆ వెంటనే శిఖర్ ధావన్ గాయాన్ని స్కాన్ చేశారు. అతను బ్యాటింగ్ కూడా చేయలేదు. డ్రెసింగ్ రూంకు మాత్రమే పరిమితమయ్యాడు.

Also Read: ధావన్ కు గాయం... ఈ మ్యాచులో ఓపెనర్ గా రాహుల్

గాయం తీవ్రత ఏ మేరకు ఉందనేది వైద్య బృందం తేల్చాల్సి ఉంది. భారత జట్టు సోమవారం, మంగళవారం రెండు విడతలుగా న్యూజిలాండ్ కు పయనమైంది. న్యూజిలాండ్ తో ఐదు టీ20 మ్యాచుల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ ను  ఈ నెల 24వ తేదీన ఆడనుంది.

ఆస్ట్రేలియాపై జరిగిన మూడో వన్డే ఐదో ఓవరులో శిఖర్ ధావన్ మైదానాన్ని వీడాడు. ఆరో ఫించ్ కవర్ లోకి షాక్ కొట్టాడు. ఆ బంతిని అందుకోవడానికి చేసిన ప్రయత్నంలో శిఖర్ ధావన్ భుజానికి గాయమైంది. దాంతో అతను మైదానాన్ని వీడాడు. అతని స్థానంలో యుజ్వేంద్ర చాహల్ ఫీల్డింగ్ కు వచ్చాడు.