ఉమ్రాన్ ఎంపికను మాజీ క్రికెటర్లంతా స్వాగతించారు. మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అయితే అతన్ని ఇంగ్లండ్‌తో టెస్ట్‌కు కూడా ఎంపిక చేయాలని డిమాండ్ చేశాడు.
సన్ రైజర్స్ హైదరాబాద్ కుర్రాడు ఐపీఎల్ లో అదరగొట్టాడు. ఐపీఎల్ లో అతని బౌలింగ్ కి అందరూ ఫిదా అయిపోయారు. ఐపీఎల్ 2022లో తాను ఆడిన అన్ని మ్యాచ్‌లలో ఫాస్టెస్ట్ బాల్ వేసిన ఘనత ఉమ్రాన్ మాలిక్‌కే దక్కింది. తన బౌలింగ్ మాయాజాలంతో సెలక్టర్ల దృష్టిలో పడిన ఉమ్రాన్ మాలిక.. ఏకంగా టీ మిండియా జట్టులో చోటు దక్కించుకున్నాడు.
తొలిసారి సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం అతన్ని ఎంపిక చేశారు. ఉమ్రాన్ ఎంపికను మాజీ క్రికెటర్లంతా స్వాగతించారు. మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అయితే అతన్ని ఇంగ్లండ్‌తో టెస్ట్‌కు కూడా ఎంపిక చేయాలని డిమాండ్ చేశాడు.
ఇప్పుడు మరో టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కూడా ఉమ్రాన్ ఎంపికపై ఆనందం వ్యక్తం చేశాడు. అంతేకాదు అతడు టెస్ట్ టీమ్ ఎంపికకు కూడా అర్హుడే అని అజర్ అనడం విశేషం. కానీ.. ఉమ్రాన్ కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ ఓ హెచ్చరిక కూడా జారీ చేశాడు. అతని వర్క్‌లోడ్‌ను చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలని లేదంటే అతడు గాయాల బారిన పడతాడని అజర్ అభిప్రాయపడ్డాడు. ఈ ఎక్స్‌ప్రెస్ ఫాస్ట్ బౌలర్‌కు కావాల్సిన సపోర్ట్ అందించారని తాను ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశాడు.
మరోవైపు మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అయితే ఉమ్రాన్ ఎంపికను స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఉమ్రాన్‌తోపాటు మరో కశ్మీర్ ప్లేయర్ అబ్దుల్ సమద్‌తో కలిసి ఇర్ఫాన్ కేక్ కట్ చేయడం విశేషం. ఈ వీడియోను అతడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. టీమిండియాలోకి నీ అరంగేట్రం జమ్ముకశ్మీర్‌తోపాటు దేశవ్యాప్తంగా యువ ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించాడు. అప్నా టైమ్ ఆయేగా అంటూ అబ్దుల్ సమద్‌ను కూడా ఇర్ఫాన్ ప్రోత్సహించాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్ 2022లో నిలకడగా రాణించాడు ఉమ్రాన్ మాలిక్. 14 మ్యాచ్‌లలో 13.57 స్ట్రైక్‌రేట్‌తో 22 వికెట్లు తీసుకున్నాడు. ఎకానమీ (9) కాస్త ఎక్కువగానే ఉన్నా.. తన స్పీడుతో ప్రత్యర్థి బ్యాటర్లను అతడు బెంబేలెత్తిస్తున్నాడు. లీగ్ మొత్తం అతడు నిలకడగా గంటకు 150 కి.మీ.పైగా వేగంతో బౌలింగ్ చేయడం విశేషం.
