India vs England: కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ మ‌రో రికార్డు.. !

India vs England: ధ‌ర్మ‌శాలలో ఇంగ్లాండ్ తో జ‌రుగుతున్న టెస్టు మ్యాచ్ లో భార‌త్ భారీ అధిక్యం దిశ‌గా దూసుకుపోతోంది. ఈ మ్యాచ్ తో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌తో పాటు యంగ్ ప్లేయ‌ర్ శుభ్ మ‌న్ గిల్ సెంచ‌రీలతో డబుల్ ధమాక అందించారు. ఈ క్ర‌మంలోనే రోహిత్ శ‌ర్మ మ‌రో ఘ‌న‌త సాధించాడు.
 

Skipper Rohit Sharma holds another record of completing 1000 runs in all three formats RMA

India vs England - Rohit Sharma : ధ‌ర్మ‌శాల వేదిక‌గా ఇంగ్లాండ్ తో జ‌రుగుతున్న మ్యాచ్ లో భారత ప్లేయ‌ర్ రికార్డుల మోత మోగిస్తున్నారు. భార‌త్-ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో చివ‌రిదైన 5వ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 218 పరుగులు చేసింది. జాక్ క్రాలే 79 పరుగుల‌తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. భార‌త్ బౌలింగ్ విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ 4 వికెట్లు, రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశారు.

ఆ తర్వాత భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో ప్లేయ‌ర్లు రాణించ‌డంతో భారీ ఆధిక్యం దిశ‌గా ముందుకు సాగుతోంది. య‌శ‌స్వి జైస్వాల్ హాఫ్ సెంచ‌రీ (58 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు) చేశాడు. ఆ త‌ర్వాత హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ సెంచ‌రీతో చెల‌రేగాడు. ఆ త‌ర్వాతి ఓవ‌ర్ లోనే శుభ్ మాన్ గిల్ సైతం సెంచ‌రీ (110 ప‌రుగులు) కొట్టాడు. వీరిద్ద‌రూ ఔట్ అయిన త‌ర్వాత అరంగేట్రం ప్లేయ‌ర్ దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ (65 ప‌రుగులు), స‌ర్ఫ‌రాజ్ ఖాన్ (56 ప‌రుగులు) హాష్ సెంచ‌రీలు సాధించారు.

Yashasvi Jaiswal: విరాట్ కోహ్లీ సాధించ‌లేద‌ని జైస్వాల్ చేశాడు

రోహిత్ శ‌ర్మ త‌న టెస్టు కెరీర్ లో 12వ సెంచరీని పూర్తి చేశాడు. త‌న ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో 103 ప‌రుగులు చేశాడు. 103 ప‌రుగుల వ‌ద్ద బెన్ స్టోక్స్ బౌలింగ్ లో ఔటయ్యాడు. అయితే, ఈ మ్యాచ్‌లో 52 పరుగులు చేయడం ద్వారా రోహిత్ శర్మ టెస్ట్ మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా 1000 పరుగులు చేసిన కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. అలాగే, అన్ని ఫార్మాట్లలో 1000 పరుగులు చేసిన 6వ ఆటగాడిగా నిలిచాడు. కెప్టెన్‌గా 1000 పరుగులు దాటిన వారి జాబితాలో 10వ స్థానంలో ఉన్నాడు.

DEVDUTT PADIKKAL : తొలి టెస్టులోనే అదరగొట్టిన దేవదత్ పడిక్కల్..

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios