MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2026 : RCB vs GT ప్లేఆఫ్ మ్యాచ్.. ఆర్బిబికి గోల్డెన్ ఛాన్స్, గెలవకున్నా నేరుగా ఫైనల్ కి?

IPL 2026 : RCB vs GT ప్లేఆఫ్ మ్యాచ్.. ఆర్బిబికి గోల్డెన్ ఛాన్స్, గెలవకున్నా నేరుగా ఫైనల్ కి?

RCB vs GT: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో RCB, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే ఫైనల్‌కు ఎవరు వెళ్తారు? రిజర్వ్ డే ఉందా? అనే విషయాలు ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Arun Kumar P
| Updated : May 26 2026, 05:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నేడే ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ పోరు
Image Credit : ANI

నేడే ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ పోరు

2026 ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. ఇవాళ్టి (మే 26) నుండే ప్లేఆఫ్స్ మొదలవుతున్నాయి. ధర్మశాలలో జరిగే క్వాలిఫయర్-1లో పాయింట్ల పట్టికలో టాప్-2లో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడతాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2లో మరో ఛాన్స్ ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వర్షం పడితే ఎవరికి లాభం..?
Image Credit : ANI

వర్షం పడితే ఎవరికి లాభం..?

అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఒకవేళ ధర్మశాలలో వర్షం కురిసి క్వాలిఫయర్-1 మ్యాచ్ రద్దయితే ఏమవుతుంది? ఎవరికి ప్లస్ అవుతుంది? క్వాలిఫయర్-1కి రిజర్వ్ డే ఉందా? అని అభిమానుల్లో చాలా ప్రశ్నలున్నాయి. 

ఒకవేళ క్వాలిఫయర్-1 మ్యాచ్ వర్షంతో రద్దయితే డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఫైనల్‌కు వెళ్లే గోల్డెన్ ఛాన్స్ దొరుకుతుంది. ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో ఫైనల్ మినహా ఏ మ్యాచ్‌కూ రిజర్వ్ డే లేదు. కాబట్టి లీగ్ దశ ముగిసేసరికి పాయింట్ల పట్టికలో నంబర్ 1 స్థానంలో ఉన్న RCB నేరుగా ఫైనల్ కి చేరుతుంది. 

Related Articles

Related image1
IPL Playoffs : ఐపిఎల్ లో సెమీ ఫైనల్స్ ఎందుకుండవు? ఈ ప్లేఆఫ్స్ విధానమే ఎందుకు?
Related image2
IPL : ఈ స్టార్ ప్లేయర్లను మెడబట్టి గెంటేయడం ఖాయం.. ఐపీఎల్ 2027 లో జరిగేది ఇదేనా..?
34
రెండు బలమైన జట్లు
Image Credit : ANI

రెండు బలమైన జట్లు

శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉంది. ఒకవేళ వర్షంతో క్వాలిఫయర్-1 రద్దయితే, గుజరాత్ విజయయాత్రకు చిన్న బ్రేక్ పడుతుంది. కానీ ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్-2 లో గుజరాత్ టైటాన్స్ మళ్లీ తలపడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ కి చేరుతుంది. 

44
ఆర్సీబీ కెప్టెన్ ధీమా
Image Credit : ANI

ఆర్సీబీ కెప్టెన్ ధీమా

రజత్ పాటీదార్ నాయకత్వంలోని డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడింది. ఇప్పుడు వరుసగా రెండోసారి ఐపీఎల్ ఫైనల్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉంది.

గుజరాత్ టైటాన్స్‌తో క్వాలిఫయర్-1 మ్యాచ్‌కు ముందు RCB కెప్టెన్ రజత్ పాటీదార్ మాట్లాడాడు. ఒత్తిడిలో బాగా ఆడే జట్టే గెలుస్తుందని, తమ జట్టు బలం బౌలింగే అని చెప్పాడు. డిఫెన్సివ్ గేమ్ ఆడే ఆలోచన లేదని, అటాకింగ్ చేయడమే తమ ప్లాన్ అని స్పష్టం చేశాడు. "మా బలం బౌలింగే. పవర్‌ప్లేలో మేము ఎలా బౌలింగ్ చేస్తామనేది చాలా ముఖ్యం. మేము డిఫెన్సివ్ ఆడటానికి రాలేదు, అటాకింగ్ మైండ్‌సెట్‌తోనే వచ్చామని అందరికీ తెలుసు. ఆరంభంలోనే వికెట్లు తీయడానికి ప్రయత్నిస్తాం. భువి, హేజిల్‌వుడ్, రసిక్ అదే చేస్తున్నారు. ఇదే పంథాను కొనసాగించాలనుకుంటున్నాం" అని అతను చెప్పాడు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
AUS vs BAN : రెండు రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్ ఖతం.. బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా రివెంజ్ విజయం
Recommended image2
IND vs SL : కొలంబో టెస్టులో గెలిస్తేనే అసలైన మజా ! ఇరు జట్లలో ఊహించని మార్పులు
Recommended image3
WTC: టీమిండియా ముందు 8 టెస్టులు.. ఫైనల్ చేరాలంటే ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి?
Related Stories
Recommended image1
IPL Playoffs : ఐపిఎల్ లో సెమీ ఫైనల్స్ ఎందుకుండవు? ఈ ప్లేఆఫ్స్ విధానమే ఎందుకు?
Recommended image2
IPL : ఈ స్టార్ ప్లేయర్లను మెడబట్టి గెంటేయడం ఖాయం.. ఐపీఎల్ 2027 లో జరిగేది ఇదేనా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved