సారాంశం
Prithvi Shaw: ఐపీఎల్ - 16 లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ పృథ్వీ షా వరుస వైఫల్యాలతో జట్టులో చోటు కోల్పోయాడు. కానీ తాజాగా అతడు..
టీమిండియా యువ ఓపెనర్, గత కొంతకాలంగా జాతీయ జట్టులోకి రావడానికి నానా తంటాలు పడుతున్న ముంబై ఆటగాడు పృథ్వీ షా ఐపీఎల్ - 16 లో దారుణంగా విఫలమయ్యాడు. ఈ సీజన్ లో అట్టర్ ఫ్లాఫ్ అయినా షా మాత్రం.. తాజాగా తన గర్ల్‌ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. చాలాకాలంగా నిధి తపాడియాతో రిలేషన్ లో ఉన్న పృథ్వీ.. మొదటిసారి ఆమెతో పబ్లిక్ గా దర్శనమిచ్చాడు.
ముంబై వేదికగా జరుగుతున్న ఐఐఎప్ఏ - 2023 అవార్డుల ప్రధానోత్సవంలో షా - నిధిలు గ్రీన్ కార్పెట్ పై సందడి చేశారు. టాప్ టు బాటమ్ బ్లాక్ కలర్ దుస్తులలో షా కనిపించగా.. నిధి కూడా బ్లాక్ కలర్ సారీ, స్లీవ్ లెస్ జాకెట్ తో దర్శనమిచ్చింది.
ఈ ఇద్దరూ చాలాకాలంగా ప్రేమించుకుంటున్నారని వార్తలు వచ్చినా పబ్లిక్ గా ఎప్పుడూ కలిసి కనిపంచలేదు. తొలిసారి ఇలా కనిపించడంతో అక్కడున్న కెమెరాలు వీరిమీదే ఫోకస్ చేశాయి. షా కంటే కాస్త పొడగరి అయిన తపాడియా.. 2016 లో టెలివిజన్ లోకి నటిగా ఎంట్రీ ఇచ్చింది. హిందీలో ప్రముఖ క్రైం షో సీఐడీలో ఆమె నటించింది. 2019లో వచ్చిన పంజాబీ సాంగ్ జట్ట కోకతో ఫేమస్ అయింది.
ఆ తర్వాత యాద్ కర్కే, సోన్ ది డబ్బి ఆల్బమ్స్ తో క్రేజ్ సొంతం చేసుకుంది. బ్యాచిలర్ డిగ్రీలో కామర్స్ చేసిన నిధి తపాడియా.. మోడలింగ్ ను కెరీర్ గా ఎంచుకుని ఆ దిశగా ముందుకు సాగుతోంది. ఇన్‌స్టాగ్రామ్ లో ఈ అమ్మడికి 117K ఫాలోవర్లు ఉన్నారు. హాట్ ఫోటోస్ తో నిత్యం సోషల్ మీడియాలో టచ్ లో ఉండే తపాడియా.. ఆల్బమ్స్, టీవీ షోస్ చేస్తూ బిజీగానే ఉంది.
ఇక పృథ్వీ విషయానికొస్తే.. ఈ ఏడాది ఐపీఎల్ లో 8 మ్యాచ్ లు మాత్రమే ఆడిన అతడు 106 పరుగులు మాత్రమే చేశాడు. చాలాకాలం తర్వాత ఈ ఏడాది న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ ద్వారా టీమ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన షా.. ఐీపఎల్ వైఫల్యంతో దాదాపు జట్టులో చోటు కోల్పోయినట్టే. దేశవాళీలో మంచి రికార్డు కలిగినప్పటికీ ఐపీఎల్ లో విఫలమవడం షా కు ఎదురుదెబ్బే..