ఐపీఎల్ 2023 సీజన్ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్‌కే ఓటు వేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. 2023 సీజన్‌లో హెడ్ కోచ్ రికీ పాంటింగ్, క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ సారథ్యంలో...

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో రిషబ్ పంత్‌ని బాగా మిస్ అయ్యింది టీమిండియా. అలాగే ఇంగ్లాండ్‌లో జరిగే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోనూ రిషబ్ పంత్ లేని లోటు టీమిండియాని వేధించనుంది. రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఎట్టకేలకు ఐపీఎల్ 2023 సీజన్‌కి రెండు వారాల ముందు కెప్టెన్‌ని అధికారికంగా ప్రకటించింది ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ మేనేజ్‌మెంట్....

ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్, ఐపీఎల్ 2023 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.. 

Scroll to load tweet…

2015 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న డేవిడ్ వార్నర్, 2015 సీజన్‌లో ఐపీఎల్ టైటిల్ గెలిచాడు. ఆ తర్వాత డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో ఐదుసార్లు ఫ్లేఆఫ్స్ ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్స్‌లో ఒకటిగా నిలిచింది. 

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి హెడ్ కోచ్‌గా రికీ పాంటింగ్ వ్యవహరించబోతున్నాడు. క్రికెట్ డైరెక్టర్‌గా సౌరవ్ గంగూలీ తిరిగి బాధ్యతలు తీసుకున్నాడు. గంగూలీ, రికీ పాంటింగ్, డేవిడ వార్నర్ త్రయం కలిసి ఢిల్లీ క్యాపిటల్స్‌ని ఎలా నడిపించబోతున్నారనేది అత్యంత ఆసక్తికరంగా మారింది.. 

ఆరు సీజన్లలో 500+ పరుగులు చేసి ఆరెంజ్ ఆర్మీ బ్యాటింగ్ భారాన్ని మోసిన డేవిడ్ వార్నర్‌, 2021 సీజన్‌ మధ్యలో కెప్టెన్సీ కోల్పోయి, తుది జట్టులో చోటు కూడా దక్కించుకోలేకపోయాడు.. 

మనీశ్ పాండే సెలక్షన్ గురించి డేవిడ్ వార్నర్ చేసిన కామెంట్లు, టీమ్ మేనేజ్‌మెంట్‌ అతనిపై సీరియస్ యాక్షన్ తీసుకునేలా చేశాయి. ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.6 కోట్ల 25 లక్షలకు డేవిడ్ వార్నర్‌ని కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

2022 ఐపీఎల్‌ సీజన్‌లో 5 హాఫ్ సెంచరీలతో 432 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 58 బంతుల్లో 92 పరుగులు చేసి రివెంజ్ తీర్చుకున్నాడు... ఐపీఎల్‌లో మంచి సక్సెస్ రేటు ఉన్న డేవిడ్ వార్నర్‌ కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్, టైటిల్ ఫెవరెట్ టీమ్స్‌లో ఒకటిగా మారింది...

2020 సీజన్‌లో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో మొట్టమొదటిగా ఫైనల్ ఆడింది ఢిల్లీ క్యాపిటల్స్. అయితే 2021 సీజన్ ఆరంభానికి ముందు శ్రేయాస్ అయ్యర్ తీవ్రంగా గాయపడి ఐపీఎల్‌కి దూరమయ్యాడు. ఈ సమయంలో రిషబ్ పంత్ కెప్టెన్సీ దక్కించుకుని, మేనేజ్‌మెంట్‌ని ఇంప్రెస్ చేశాడు. ఈ కారణంగా అయ్యర్ రీఎంట్రీ ఇచ్చినా రిషబ్ పంత్‌నే కెప్టెన్‌గా కొనసాగించింది టీమ్ మేనేజ్‌మెంట్...

ఈ కారణంగా శ్రేయాస్ అయ్యర్, కెప్టెన్సీ వెతుక్కుంటూ కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి వెళ్లాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో అటు శ్రేయాస్ అయ్యర్ కానీ, ఇటు రిషబ్ పంత్ కానీ టీమ్స్‌ని ప్లేఆఫ్స్ చేర్చలేకపోయారు. వెన్నుగాయంతో బాధపడుతున్న శ్రేయాస్ అయ్యర్, ఐపీఎల్ 2023 సీజన్ ఆడతాడా? లేదా? అనేది అనుమానంగా మారింది.. డిసెంబర్ 2022లో కారు ప్రమాదానికి గురైన రిషబ్ పంత్, ఐపీఎల్ 2023 సీజన్‌తో పాటు ఏడాది పాటు క్రికెట్‌కి దూరమయ్యాడు. రిషబ్ పంత్, 2023 సీజన్‌లో ఐపీఎల్ మ్యాచులు చూసేందుకు స్టేడియానికి వచ్చినా అది చాలా విషయమే..