DC vs LSG : కుల్దీప్ యాదవ్ కుమ్మెశాడు.. అదరగొట్టిన ఢిల్లీ బౌలర్లు.. కానీ..

DC vs LSG : ఐపీఎల్ 2024 లో 26వ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ వ‌ర్సెస్ లక్నో సూప‌ర్ జెయింట్స్ త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్ లో ఢిల్లీ బౌలర్లు అదరగొట్టారు.కుల్దీప్ యాదవ్ తన బౌలింగ్ తో కుమ్మేశాడు. 
 

Delhi Capitals bowler Kuldeep Yadav hits the Lucknow Supergiants with super bowling DC vs LSG IPL 2024 RMA

Delhi Capitals vs Lucknow Supergiants : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (ఐపీఎల్ 2024) 26వ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో త‌ల‌ప‌డ్డాయి. లక్నోలోని బీఆర్ఎస్ఏబీవీ ఎకానా క్రికెట్ స్టేడియంలో జ‌రిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ల‌క్నో బ్యాటింగ్ ఎంచుకుంది. అందుకు తగ్గట్టుగానే ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, క్వింటన్ డి కాక్ ఇద్దరూ ధ‌నాధ‌న్ గేమ్ ఆడారు. కానీ పెద్ద ఇన్నింగ్స్ గా వాటిని మార్చ‌లేక‌పోయారు. ఖలీల్ అహ్మద్ వేసిన ఓవ‌ర్ లో ఎల్బీడబ్ల్యూగా క్వింటన్ డి కాక్ 19 పరుగుల వద్ద ఔటయ్యాడు. తర్వాత, వ‌చ్చిన‌ దేవదత్ ప‌డిక్క‌ల్ 3 పరుగుల వద్ద ఇదే తరహాలో ఎల్బీడబ్ల్యూగా పెవిలియ‌న్ కు చేరాడు. దీంతో ల‌క్నో క‌ష్టాలు మొద‌ల‌య్యాయి.

కుల్దీప్ యాదవ్ బెంబేలెత్తించాడు.. 

ఈ మ్యాచ్ లో కుల్దీప్ యాద‌వ్ అద్భుత‌మైన బౌలింగ్ తో ఢిల్లీ ఆట‌గాళ్ల‌ను బెంబేలెత్తించాడు. రంగంలోకి దిగిన వెంట‌నే మార్కస్ స్టోయినిస్‌ను కుల్దీప్ యాదవ్ 8 పరుగుల వద్ద అవుట్ చేశాడు. తన తొలి ఓవర్  3వ బంతికే వికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాతి బంతికే గోల్డెన్ డక్‌తో గూగ్లీని నికోలస్ పూరన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన దీపక్ కూడా 10 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో లక్నో జట్టులో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ స్వల్ప పరుగులకే అవుటయ్యారు.

DC VS LSG : మయాంక్ యాదవ్, అన్రిచ్ నోర్జే ఎందుకు ఆడటం లేదు?

త‌న రెండో ఓవ‌ర్ లో కుల్దీప్ యాద‌వ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ వికెట్ తీశాడు. రిషబ్ పంత్ అంపైర్ ఔట్ కాదనేందుకు రివ్యూ కోరాడు. బంతి బ్యాట్‌కు తగిలిందని స్పష్టమైంది. ఆ తర్వాత కేఎల్ రాహుల్ 39 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో కుల్దీప్ యాదవ్ 2 ఓవర్లలో 7 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అయితే, చివరికి త‌న‌ మిగిలిన 2 ఓవర్లు బౌల్ చేసి 20 పరుగులతో ఓవర్ ముగించాడు. కుర్నాల్ పాండ్యా కూడా 3 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఒక దశలో లక్నో సూపర్‌జెయింట్స్‌ 12.6 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 97 పరుగులకే కుప్పకూలింది. అయితే, చివ‌ర‌లో ఆయూష్ బ‌దోని 5 ఫోర్లు, ఒక సిక్స‌ర్ తో ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ఆడి 35 బంతుల్లో 55 ప‌రుగులు చేశాడు. మ‌రో ఎండ్ లో అర్ష‌ద్ ఖాన్ 20 ప‌రుగుల  ఇన్నింగ్స్ ఆడ‌టంతో ల‌క్నో టీమ్ 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 167 ప‌రుగులు చేసింది. కుల్దీప్ యాద‌వ్ 3, ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీసుకున్నాడు. ఇషాత్ శ‌ర్మ‌, ముఖేష్ కుమార్ లు చెరో వికెట్ తీసుకున్నారు.

 

 

వాంఖడేలో సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం.. రెండో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios