Asianet News TeluguAsianet News Telugu

DC vs LSG : మయాంక్ యాదవ్, అన్రిచ్ నోర్జే ఎందుకు ఆడటం లేదు?

DC vs LSG : ఐపీఎల్ 2024 లో 26వ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ వ‌ర్సెస్ లక్నో సూప‌ర్ జెయింట్స్ త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్ లో లక్నో తమ ప్లేయింగ్ ఎలెవన్ లో ఒక మార్పు చేయగా, ఢిల్లీ రెండు మార్పులతో బ‌రిలోకి దిగింది.
 

DC vs LSG IPL 2024 26th Match : Why is Mayank Yadav, Anrich Nortje not playing? RMA
Author
First Published Apr 12, 2024, 9:20 PM IST

Delhi Capitals vs Lucknow Supergiants : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (ఐపీఎల్ 2024) 26వ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో త‌ల‌ప‌డ్డాయి. లక్నోలోని బీఆర్ఎస్ఏబీవీ ఎకానా క్రికెట్ స్టేడియంలో జ‌రిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ల‌క్నో టీమ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గత రికార్డును దృష్టిలో ఉంచుకుని బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, అరంగేట్రంతోనే అద్భుత‌మైన బౌలింగ్ తో అద‌ర‌గొట్టిన మ‌యాంక్ యాద‌వ్ ఈ మ్యాచ్ కు దూరం అయ్యాడు. అలాగే, ఢిల్లీ స్టార్ బౌల‌ర్ అన్రిచ్ నోర్జే కూడా ఈ మ్యాచ్ ఆడ‌టం లేదు. ఎందుకు ఇద్ద‌రు స్టార్ ప్లేయ‌ర్లు ఈ మ్యాచ్ కు దూరం అయ్యారు?

వరుసగా మూడు విజయాలతో బరిలోకి దిగిన లక్నో జట్టు గుజరాత్ టైటాన్స్ తో జరిగిన గత మ్యాచ్ తర్వాత పొత్తికడుపు భాగంలో నొప్పి రావడంతో ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ జట్టుకు దూరమయ్యాడు. ముఖ్యంగా, లైన్, లెంగ్త్పై మంచి నియంత్రణతో పాటు గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేయగల అసాధారణ సామర్థ్యంతో మయాంక్ ఈ సీజన్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు. అత‌ను ఆడిన‌ మూడు మ్యాచుల్లో 9.0 సగటు, 6.0 ఎకానమీతో ఆరు వికెట్లు పడగొట్టి జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. వ‌రుస‌గా రెండు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుల‌ను అందుకున్నాడు.

వాంఖడేలో సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం.. రెండో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ

ఈ క్ర‌మంలోనే మయాంక్ స్థానంలో 26 ఏళ్ల లెఫ్టార్మ్ పేసర్ అర్షద్ ఖాన్ ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడనున్నాడు. తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్ ల‌లో అర్షద్ ఐదు వికెట్లు పడగొట్టాడు. మరోవైపు వరుస ఓటముల మ‌ధ్య‌ ఢిల్లీ క్యాపిటల్స్ కూడా తమ ప్లేయింగ్ ఎలెవన్ లో కొన్ని మార్పులు చేసింది. గాయం కారణంగా గత మూడు మ్యాచ్ లకు దూరమైన స్టార్ మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను జట్టులోకి తీసుకుంది. గత రెండు మ్యాచ్ లకు దూరమైన ముఖేష్ కుమార్ సేవలను ఉప‌యోగించుకుంటోంది. దీంతో కుల్దీప్, ముకేష్ లకు చోటు కల్పించేందుకు జట్టు యాజమాన్యం అన్రిచ్ నోర్జే, లలిత్ యాదవ్ లను ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించింది.

నాలుగు మ్యాచ్ ల్లో 35.83 సగటు, 13.43 ఎకానమీతో ఆరు వికెట్లు పడగొట్టిన నోర్జే ఈ సీజన్ లో ఆశించిన స్థాయిలో ఫ‌లితాలు ఇవ్వ‌లేదు. ఆడిన ఏకైక మ్యాచ్ లో లలిత్ యాదవ్ మూడు ప‌రుగులు చేయ‌గా, త‌న ఒకే ఓవర్ లో 15 పరుగులు స‌మ‌ర్పించుకున్నాడు. అలాగే, విండీస్ వికెట్ కీపర్ బ్యాట్స్ మ‌న్ షాయ్ హోప్ ను కూడా జట్టులోకి తీసుకున్న డీసీ తమ బ్యాటింగ్ ను మరింత బలోపేతం చేసింది.

ఆర్సీబీని దెబ్బ‌కొట్టి చ‌రిత్ర సృష్టించిన బుమ్రా..

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, షాయ్ హోప్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్/ కెప్టెన్), ట్రిస్టాన్ స్టోబ్స్, జేక్ ఫ్రేజర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్

ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ సబ్స్: జై రిచర్డ్సన్, అభిషేక్ పోరెల్, కుమార్ కుషాగ్రా, సుమిత్ కుమార్, ప్రవీణ్ దూబే 

లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోనీ, కృనాల్ పాండ్యా, అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్, నవీన్ ఉల్ హక్, యశ్ ఠాకూర్ 

లక్నో సూపర్ జెయింట్స్ ఇంపాక్ట్ సబ్స్: కృష్ణప్ప గౌతమ్, దీపక్ హుడా, మణిమారన్ సిద్ధార్థ్, అమిత్ మిశ్రా, మాట్ హెన్రీ

డీకే దుమ్మురేపాడు.. ఏమ‌న్న బ్యాటింగ్ గా ఇది దినేష్ కార్తీక్

Follow Us:
Download App:
  • android
  • ios