ధోనీ, ముంబై పేసర్ దీపక్ చాహర్ మధ్య స్నేహం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చెన్నై: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన ముంబై 9 వికెట్లు కోల్పోయి 155 రన్స్ చేసింది.

తిలక్ వర్మ 25 బంతుల్లో 31 రన్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65), రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 53) ఇన్నింగ్స్‌లు చెన్నైని గెలిపించాయి.

మ్యాచ్ తర్వాత ధోనీ, ముంబై పేసర్ దీపక్ చాహర్ మధ్య స్నేహం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీమ్ మారినా చెన్నై కెప్టెన్ ధోనీ, చాహర్ మధ్య బంధం ఏమీ మారలేదని వీడియో చూస్తే తెలుస్తోంది.

అంతకుముందు మ్యాచ్‌లో చాహర్ ధోనీని సరదాగా స్లెడ్జ్ చేశాడు. ధోనీ క్రీజులోకి రాగానే దగ్గరికి వచ్చి చప్పట్లు కొట్టాడు.

ధోనీతోనే కాదు రవీంద్ర జడేజాతో కూడా చాహర్ ఇలానే చేశాడు. ఆ తర్వాత ధోనీ చాహర్‌కు రిప్లై ఇచ్చాడు. మ్యాచ్ అయిపోయిన తర్వాత షేక్ హ్యాండ్ ఇస్తుండగా ధోనీ బ్యాట్‌తో చాహర్ వీపుపై కొట్టాడు. ఆ వీడియోను ఇక్కడ చూడండి.

Scroll to load tweet…
Scroll to load tweet…

ముంబై ఓడిపోయినా వాళ్ల ప్లేయర్ విఘ్నేష్ పుత్తూర్‌కు మాత్రం మంచి జరిగింది. విఘ్నేష్ 4 ఓవర్లలో 32 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. రుతురాజ్ గైక్వాడ్, శివం దుబే, దీపక్ హూడా వికెట్లను విఘ్నేష్ తీశాడ