టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కి అరుదైన గౌరవం దక్కనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలోని ఒక స్టాండ్ కు గంభీర్ పేరు పెట్టాలని ఢిల్లీ, డిస్ట్రిక్ అసోసియేషన్ నిర్ణయించింది. భారత జట్టుకు ఎన్నో సేవలు అందించిన ఈ ఢిల్లీ ఆటగాడికి ఒక గుర్తింపు ఇవ్వాలని డీడీసీఏ నిర్ణయం తీసుకుంది.

AlsoRead గంగూలీ గల్లీలో గులాబీ బంతి... దాని కథ కమామిషు...

దీనిలో భాగంగానే అరుణ్ జైట్లీ స్టేడియంలోని ఒక స్టాండ్ కు గంభీర్ పేరును దాదాపు ఖరారు  చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వచ్చే నెలలో గంభీర్ పేరుతో స్టాండ్ ఏర్పాటు చేయనున్నారు. జూనియర్, సీనియర్ స్థాయిలో ఢిల్లీ తరపున గంభీర్ ఎన్నో మ్యాచులు ఆడారు. 2018లో  ఆంధ్రప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో భాగంగా ఢిల్లీ తరపున చివరి మ్యాచ్ ఆడుతూనే గంభీర్ రిటైర్మెంట్ ప్రకటించాడు.

AlsoRead నా నేరంలో పార్ట్ నర్ ఇతడే... కోహ్లీ ట్వీట్ వైరల్...

1999లో గంభీర్ రంజీ ట్రోఫీ అరంగేట్రం చేయగా... ఢిల్లీ తరపున తన ఆటను ప్రారంభించాడు. అలా టెస్టు ఫార్మాట్ లోకి అడుగుపెట్టి భారత్ తరపున 9ఏళ్లు క్రికెట్ ఆడాడు. 2007-8 సీజన్ లో అతని సారథ్యంలో ఢిల్లీ జట్టు రంజీ ట్రోఫీని అందుకుంది.