Asianet News TeluguAsianet News Telugu

DC vs RR: గబ్బర్, అయ్యర్ మెరుపులు... అయినా భారీ స్కోరు చేయలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

వరుసగా రెండో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన శిఖర్ ధావన్... అర్ధశతకం బాదిన శ్రేయాస్ అయ్యర్... 

జోఫ్రా ఆర్చర్‌కు మూడు వికెట్లు..

 

DC vs RR: Delhi Capitals Scored good total against Rajasthan Royals CRA
Author
India, First Published Oct 14, 2020, 9:12 PM IST

IPL 2020: టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్, నిర్ణీత 20 ఓవర్లలో 7  వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ మొదటి బంతికే పృథ్వీ షా అవుట్ కాగా... అజింకా రహానే 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఢిల్లీ క్యాపిటల్స్‌ను శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ కలిపి ఆదుకున్నారు.

శిఖర్ ధావన్ 33 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 57 పరుగులు చేయగా, శ్రేయాస్ అయ్యర్ 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ అవుటైన తర్వాత పెద్దగా పరుగులు రాలేదు. స్టోయినిస్ 18, అలెక్స్ క్యారీ 14, అక్షర్ పటేల్ 7 పరుగులు చేయడంతో మంచి స్కోరు చేయగలిగింది ఢిల్లీ క్యాపిటల్స్...

రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు తీయగా ఉనద్కడ్, కార్తీక్ త్యాగి, శ్రేయాస్ గోపాల్ తలా ఓ వికెట్ తీశారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios