Asianet News TeluguAsianet News Telugu

DCvsRCB: పడిక్కల్ హాఫ్ సెంచరీ... ఢిల్లీ ముందు ఈ టార్గెట్ సరిపోతుందా?

సీజన్‌లో ఐదో హాఫ్ సెంచరీ బాదిన దేవ్‌దత్ పడిక్కల్...

29 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ... 35 పరుగులు చేసిన ఏబీ డివిల్లియర్స్...

3 వికెట్లు తీసిన నోకియా... రబాడాకి రెండు వికెట్లు...

 

DC vs RCB: kohli team failed to score big total against Delhi Capitals CRA
Author
India, First Published Nov 2, 2020, 9:06 PM IST

IPL 2020 ప్లేఆఫ్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. జోష్ ఫిలిప్ 12 పరుగులు చేసి అవుట్ కాగా కెప్టెన్ విరాట్ కోహ్లీ 24 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్స్‌తో 29 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

యంగ్ ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ సీజన్‌లో ఐదో హాఫ్ సెంచరీ నమోదుచేసుకున్నాడు. ఈ సీజన్‌లో కెఎల్ రాహుల్, పడిక్కల్ మాత్రమే ఐదేసి హాఫ్ సెంచరీలు బాదారు. 41 బంతుల్లో 5 ఫోర్లతో 50 పరుగులు చేసి అవుట్ అయ్యాడు దేవ్‌దత్ పడిక్కల్. క్రిస్ మోరిస్ డకౌట్ కాగా...శివమ్ దూబే 17 పరుగులు చేశాడు. ఏబీ డివిల్లియర్స్ 21 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 35 పరుగులు చేశాడు. 

ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో నోకియాకి మూడు వికెట్లు దక్కగా రబాడాకి రెండు, రవిచంద్రన్ అశ్విన్ ఓ వికెట్ తీశాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios