IPL 2020: టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. పృథ్వీషా 4 పరుగులే చేసి మొదటి ఓవర్‌లోనే అవుట్ అయ్యాడు. సీజన్‌లో మొదటి మ్యాచ్ ఆడిన అజింకా రహానే 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 

శ్రేయాస్ అయ్యర్ 33 బంతుల్లో 5 ఫోర్లతో 42 పరుగులు చేయగా.. శిఖర్ ధావన్ ఐపీఎల్ కెరీర్‌లో 38వ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. స్టోయినిస్ 12 పరుగులు చేసి రనౌట్ కాగా... డెత్ ఓవర్లలను పెద్దగా పరుగులు ఇవ్వకుండా ఢిల్లీని కంట్రోల్ చేశారు ముంబై బౌలర్లు. 
 

ధావన్ 52 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్స్‌తో 69 పరుగులు చేయగా, అలెక్స్ క్యారీ 14 పరుగులు చేశాడు. కృనాల్ పాండ్యా 2 వికెట్లు తీయగా ట్రెండ్ బౌల్ట్ ఓ వికెట్ తీశాడు.