ఐపీఎల్ కారణంగా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్‌కి ఇక్కడ కూడా మంచి ఫాలోయింగ్ వచ్చింది. తనను ‘వార్నర్ భాయ్’ అని పిలిచే భారత అభిమానుల ప్రేమకి ముగ్ధుడైన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఇండియా తనకి సెకండ్ హోమ్ అంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే.

వార్నర్ చేసే టిక్ టాక్ వీడియోల కారణంగా అతని కూతురు ఇండి రా వార్నర్‌కి మాత్రం విరాట్ కోహ్లీ అంటే బాగా ఇష్టమట. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది వార్నర్ భార్య క్యాండిక్ వార్నర్. ‘సారీ వార్నర్ అంటూ ఈ వీడియోను పోస్టు చేసింది క్యాండిక్. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూతుళ్లు బ్యాటింగ్ ఆడుతున్న వీడియోలను పోస్టు చేసింది ఆరెంజ్ ఆర్మీ.

వార్నర్ కూతుళ్లు కూడా తండ్రిలాగే బ్యాటింగ్‌లో ఇరగదీశారు. పెద్ద కూతురు ఇవీ వికెట్ల మధ్య పరుగెడుతూ సింగిల్స్ తీస్తే, ఇండి రా మాత్రం భారీ షాట్లు ఆడేందుకే ఇంట్రెస్ట్ చూపించింది. వార్నర్ భార్య క్యాండిక్ వార్నర్ ఈ వీడియోలను రీట్వీట్ చేసింది.