రైట్ హ్యాండ్ తో ఆడి.. అందరికీ షాకిచ్చిన వార్నర్..!

రైట్ హ్యాండర్ గా మారడమే కాకుండా, అద్భుతమైన బౌండరీ కూడా సాధించాడు. ఆ ఓవర్ లో వార్నర్ 6 పరుగులు చేయడం విశేషం.

David Warner Turns Right-Hander Against Ravichandran Ashwin, Stuns Everyone With Sweep Shot ram

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు టీమిండియా జోరు కొనసాగుతోంది. ఆసియా కప్ 2023 టోర్నీ గెలిచిన భారత జట్టు, సీనియర్లు లేకుండా ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. తొలి వన్డేలో భారీ లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా, రెండో వన్డేలో 99 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది... ఆస్ట్రేలియా 28.2 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌట్ అయ్యింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం లక్ష్యం మారడంతో ఓటమి తేడా తగ్గింది కానీ లేకుండా టీమిండియాకి 182 పరుగుల తేడాతో భారీ విజయం దక్కి ఉండేది.

ఈ సంగతి పక్కన పెడితే, ఈ మ్యాచ్ లో ఆసిస్ క్రికెటర్ వార్నర్ ఫ్యాన్స్ కి ఊహించని షాక్ ఇచ్చాడు.  ఈ మ్యాచ్ లో వార్నర్ రైట్ హ్యాండ్ తో బ్యాటింగ్ చేయడం విశేషం. ఆసీస్ ఇన్నింగగ్స్ 13ఓవర్లు వేసిన రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ లో వార్నర్ రైట్ హ్యాండ్ బ్యాటర్ గా అవతారమెత్తాడు. రైట్ హ్యాండర్ గా మారడమే కాకుండా, అద్భుతమైన బౌండరీ కూడా సాధించాడు. ఆ ఓవర్ లో వార్నర్ 6 పరుగులు చేయడం విశేషం.

 

ఆ తర్వాత 15 ఓవర్ వేసిన అశ్విన్ బౌలింగ్ లోనే స్విచ్ హిట్ కు ప్రయత్నించిన వార్నర్, ఎల్బీ డబ్ల్యూ రూపంలో పెవిలియన్ కు చేరాడు. వార్నర్ ఔట్ కాగానే  అశ్విన్ ఒక్కసారిగా నవ్వుకున్నాడు. కాగా వార్నర్ రైట్ హ్యాండ్ బ్యాటింగ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వార్నర్ లో ఈ మ్యాచ్ లో 53 పరుగులు చేశాడు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios