Asianet News TeluguAsianet News Telugu

David Warner-Pushpa: శ్రీవల్లి పాటకు కాలు కదిపిన వార్నర్ భాయ్.. తగ్గేదేలే అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ..

David Warner Imitates Allu Arjun Again: డేవిడ్ వార్నర్ కు మరోసారి అల్లు అర్జున్  పూనాడు.  గతంలో పుష్ప సినిమాలోని ‘యే బిడ్డా.. ఇది నీ అడ్డా..’ ‘తగ్గేదేలే’ వంటి పాటలకు స్టెప్పులేసిన  వార్నర్ భాయ్  తాజాగా.. 
 

David Warner nails Allu Arjun's hook step in Srivalli song from 'Pushpa', video Went Viral In Social Media
Author
Hyderabad, First Published Jan 21, 2022, 5:18 PM IST

ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ఎక్కడ చూసినా పుష్ప ఫీవరే. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ సినిమా సాంగ్స్, డైలాగ్స్ కు ఉన్న క్రేజ్ మాములుగా లేదు. గల్లీలో ఉండే అభిమానులను మొదలుకుని దేశ విదేశాలలో ఉన్న క్రికెటర్ల దాకా దీని గురించే చర్చ.  అల్లు అర్జున్-సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా రికార్డులు ప్రభంజనం సృష్టిస్తుండగా.. బన్నీ పాటలు, డైలాగులను  అనుకరించడంలో దిట్ట అయిన ఆస్ట్రేలియా ఆటగాడు,  సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ సారథి డేవిడ్ వార్నర్ మరోసారి  మెరిశాడు. పుష్పలోని సిద్ శ్రీరామ్ పాడిన ‘చూపే బంగారమాయేనే శ్రీవల్లి..’ పాట (కన్నడ వెర్షన్) కు బన్నీ వేసిన హుక్ స్టెప్ ను వేసి అదరగొట్టాడు. 

గతంలో  ‘యే బిడ్డా.. ఇది నా అడ్డా’, ‘నీయవ్వ తగ్గేదేలే...’  లను అనుకరించిన వార్నర్.. తాజాగా శ్రీవల్లి పాటకు కాలు కదిపాడు. ఆ పాటకు  బన్నీ వేసిన స్టెప్పులనే అచ్చు గుద్దినట్టు దించాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 

 

కాగా ఈ వీడియోను షేర్ చేస్తూ వార్నర్.. సినిమాలో బన్వర్ సింగ్ షెకావత్ (ఫవాద్ ఫాజిల్) అన్నట్టు (పార్టీ లేదా పుష్ప).. ‘తర్వాత ఏంటి పుష్ప.. ’అని క్యాప్షన్ ఇచ్చాడు. ఇదిలాఉండగా.. ఈ వీడియోకు అల్లు అర్జున్ కూడా కామెంట్ చేయడం విశేషం. 

David Warner nails Allu Arjun's hook step in Srivalli song from 'Pushpa', video Went Viral In Social Media

వార్నర్ పోస్టుకు బన్నీ స్పందిస్తూ.. ‘చించేశావ్..’ అన్న రీతిలో  నెటిజన్లు వాడే ఫైర్ సింబల్ ను వాడాడు. ఇదే పోస్టులో వార్నర్.. బన్నీకి రిప్లై ఇస్తూ.. ‘నాటు నాటు (ఆర్ఆర్ఆర్)  చాలా కష్టం..’ అని రాసుకొచ్చాడు. ఇక  దీనిపై బన్నీ అభిమానులు స్పందిస్తూ.. ‘బన్నీ.. వార్నర్ నిన్ను ఆవాహనం చేసుకున్నాడు..’ అని  కామెంట్లు పెడుతున్నారు.

 

పుష్ప సినిమాలోనే గాక గతంలో అల వైకుంఠపురం సినిమాలోని ‘బుట్టబొమ్మ’ పాటకు కూడా తన ఫ్యామిలీతో పాటు  స్టెప్పులేశాడు వార్నర్. ఈ వీడియో నెట్టింట్లో సంచలనం సృష్టించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios