Asianet News TeluguAsianet News Telugu

CSK VS RR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

చెన్నై, రాజస్థాన్ ల మ్యాచులో టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.

CSK VS RR: Sanju Samson wins toss and elects to field
Author
Mumbai, First Published Apr 19, 2021, 7:04 PM IST

ఐపీఎల్ సీజన్లోని 12వ మ్యాచ్ మరికాసేపట్లో చెన్నై, రాజస్థాన్ ల మధ్య ప్రారంభమవనుంది. ఈ మ్యాచులో రాజస్థాన్ టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈ రెండు జట్టులో ఇప్పటివరకు రెండేసి మ్యాచులు ఆడగా ఒక విజయం, ఒక పరాజయంతో సమానంగా ఉన్నాయి. ఈ సీజన్లో ఇరు జట్లకు ఇదే తొలి పేస్ ఆఫ్. 

పంజాబ్ మీద విజయంతో లయ దొరకబుచ్చుకున్న చెన్నై మంచి జోరుమీదుంటే... ఢిల్లీ మీద సాధించిన అద్భుత విజయంతో రాజస్థాన్ పూర్తి కాన్ఫిడెంట్ గా బరిలోకి దిగుతుంది. గత మ్యాచులో చెన్నై ప్లేయర్స్ లో దీపక్ చాహర్, చిన్న తల రైనాలు ఇద్దరు తన మునుపటి ఫామ్ ని అందుకొని ఈ సీజన్ లో దాన్ని కొనసాగించాలని చూస్తున్నారు. 

ఇక రాజస్థాన్ విషయానికి వస్తే తమ తొలి మ్యాచులో ఓటమి చెందినప్పటికీ... వారు దాదాపుగా గెలిచినంత పనిచేసారు. సంజు శాంసన్ అద్భుత సెంచరీ ఈ సీజన్ మొత్తం మన కండ్ల ముందు మెదలడం మాత్రం తథ్యం. ఇక మొన్న ఢిల్లీ తో మ్యాచులో అయితే ఈ సీజన్ లోనే అత్యంత కాస్ట్లీ ప్లేయర్ క్రిస్ మోరిస్ తన సత్త ఏమిటో చూపించాడు. ఒంటిచేత్తో మ్యాచును గెలిపించి రాజస్థాన్ కాన్ఫిడెన్సును మరింతగా పెంచాడు. 

చెన్నై నేటి మ్యాచులో తమ విన్నింగ్ స్ట్రీక్ ని కంటిన్యూ చేయాలని డిసైడ్ అయినట్టుగా కనబడుతుంది. ఇంకో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఇదే రోజున చెన్నై జట్టు తమ తొలి ఐపీఎల్ మ్యాచులో ఆరంగ్రేటం చేసింది.  మరోపక్క రాజస్థాన్ సైతం తమ టీం ఎఫర్ట్ తో మారోసారి ఈ మ్యాచును కైవసం చేసుకోవాలని యోచిస్తోంది. 

చెన్నై జట్టు: ఋతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్, మొయిన్ అలీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, సామ్ కరన్, ధోని, జడేజా, బ్రావో, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్

రాజస్థాన్ జట్టు: ఓరా, జోస్ బట్లర్, సంజు శాంసన్, శివమ్ దూబే, డేవిడ్ మిల్లర్, రియాన్ పరాగ్, రాహుల్ తేవాటియా, క్రిస్ మోరిస్, ఉనద్కత్, సకారియ, ముస్తాఫిజుర్

Follow Us:
Download App:
  • android
  • ios