Asianet News TeluguAsianet News Telugu

CSKvsRR: రాజస్థాన్ ఈజీ విక్టరీ... ఫ్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న ధోనీ టీమ్...

28 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

నాలుగో వికెట్‌కి బట్లర్, స్మిత్ పరుగుల భాగస్వామ్యం...

హాఫ్ సెంచరీ చేసిన జోస్ బట్లర్..

CSK vs RR: Rajasthan Royals easy victory, csk gone off from playoff race CRA
Author
India, First Published Oct 19, 2020, 10:54 PM IST

IPL 2020: ఐపీఎల్ చరిత్రలోనే ఆడిన ప్రతీ సీజన్‌లోనూ ప్లేఆఫ్ చేరిన ఏకైక జట్టుకు చుక్కలు చూపించింది 2020 సీజన్. కీలకమైన మ్యాచ్‌లో స్వల్ప స్కోరుకే పరిమితమై, అధికారికంగా ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంది చెన్నై సూపర్ కింగ్స్. 10 మ్యాచుల్లో ఏడు మ్యాచుల్లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్, ఇక్కడి నుంచి ప్లేఆఫ్ చేరాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే.. 

126 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్, 28 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే స్టీవ్ స్మిత్, జోస్ బట్లర్ కలిసి అద్భుతమైన భాగస్వామ్యంలో ఇన్నింగ్స్ నిర్మించారు. బట్లర్ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకోగా స్టీవ్ స్మిత్ పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో బెన్ స్టోక్స్ 19 పరుగులు చేయగా రాబిన్ ఊతప్ప 4 పరుగులు చేశాడు.

సంజూ శాంసన్ డకౌట్ కాగా... చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో దీపక్ చాహార్ 2, హాజల్ వుడ్ ఓ వికెట్ తీశారు. బట్లర్ 48 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 పరుగులు చేయగా స్టీవ్ స్మిత్ 34 బంతుల్లో 26 పరుగులు చేశాడు.

Follow Us:
Download App:
  • android
  • ios