టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ కి ఆ జట్టు బౌలర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. కానీ చెన్నై డీప్ బ్యాటింగ్ లైన్ అప్ వల్ల ఆ జట్టు 188 పరుగులు చేసి రాజస్థాన్ ముందు 189 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.

బ్యాటింగ్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కుంటున్న రుతురాజ్ గైక్వాడ్ మరోసారి స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. తనమీద ప్రెజర్ పెరుగుతుండడంతో భారీ షాట్ కి యత్నించి ముస్తాఫిజుర్ బౌలింగ్ లో శివమ్ దుబేకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

మరో ఎండ్ లో డేంజరస్ గా కనబడుతున్న ఫాఫ్ డుప్లెసిస్ ని క్రిస్ మోరిస్ అవుట్ చేయడంతో చెన్నై ఇద్దరు ఓపెనర్లను కోల్పోయింది. సౌతాఫ్రికన్ల సమరంలో ఫాఫ్ ని అవుట్ చేయడం ద్వారా క్రిస్ మోరిస్ పైచేయి సాధించడం కొసమెరుపు. 

ఇక ఆ తరువాత మొయిన్ అలీ, సురేష్ రుణాలు కలిసి ఇన్నింగ్స్ ను నిలబెట్టే ప్రయాత్నం చేసారు. రెండు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టి ఊపు మీదున్న మొయిన్ అలీని రాహుల్ తేవాటియా పెవిలియన్ కి పంపించాడు. ఆ తరువాత అంబటి రాయుడుతో కలిసి రైనా ఇన్నింగ్స్ ని చక్కదిద్దే ప్రయత్నం చేసాడు. 

ఈ ప్రయత్నంలో భారీ షాట్లు ఆడుతున్న ఇద్దరినీ రాజస్థాన్ బౌలర్ చేతన్ సకారియ వెంటవెంటనే అవుట్ చేసాడు. మూడు సిక్సర్లతో ఊపుమీదున్న రాయుడిని 14వ ఓవర్లో రెండవ బంతికి అవుట్ చేస్తే అదే ఓవర్లో 5వ బంతికి చిన్న తల రైనాను డగ్ అవుట్ కి చేర్చాడు. వీరిద్దరి తరువాత స్కోర్ బోర్డును నడిపించే బాధ్యతను ధోని, జడ్డు భుజానికెత్తుకున్నారు. 

బంతులను పేస్ లేకుండా స్లో బళ్ళోస్ వేస్తూ బ్యాట్స్ మెన్ ని రాజస్థాన్ బౌలర్లు తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. రాయుడు, రుణాలు అవుట్ అయినా తరువాత ఒక బౌండరీ సాధించడానికి ధోని, జడేజాలకు 2.4 ఓవర్లు పట్టింది. రైనా, రాయుడులను అవుట్ చేసిన చేతన్ సకారియ ధోని ఫోర్ కొట్టిన నెక్స్ట్ ఓవర్లోనే అతనిని కూడా పెవిలియన్ కి చేర్చాడు. 

ధోని అవుట్ అయినా తరువాత క్రీజ్ లోకి వచ్చిన సామ్ కరన్ భారీ సిక్సర్ తో తన ఖాతా తెరిచాడు. తానెందుకు డేంజరస్ ప్లేయర్నో మరో సారి ప్రూవ్ చేసాడు. ఆ తరువాతి ఓవర్లో క్రిస్ మోరిస్ జడేజాను అవుట్ చేసాడు.  ఇక ఆ తరువాత వచ్చిన బ్రేవో వరుస ఫోర్లతో విరుచుకుపడ్డాడు. 

ఆఖరి ఓవర్లో తొలి బంతికే సామ్ కరన్ రన్ అవుట్ గా వెనుదిరిగగా, నాలుగవ బంతికి శార్దూల్ ఠాకూర్ రన్ అవుట్ అయ్యాడు. ఆఖరు బంతికి బ్రావో సిక్సర్ కొట్టడంతో 188 పరుగులను సాధించింది చెన్నై జట్టు.