Asianet News TeluguAsianet News Telugu

CSKvsRCB: మళ్లీ చిత్తుగా ఓడిన చెన్నై సూపర్ కింగ్స్... ఆర్‌సీబీ ‘రాయల్’ విక్టరీ...

42 పరుగులు చేసిన అంబటి రాయుడు...

మళ్లీ ఫెయిల్ అయిన సీఎస్‌కే బ్యాటింగ్ ఆర్డర్...

మళ్లీ స్వల్ప స్కోరుకే అవుటైన ధోనీ...

చెన్నై సూపర్ కింగ్స్‌పై 37 పరుగుల తేడాతో గెలిచి ఐపీఎల్‌ కెరీర్‌లో సీఎస్‌కే అతిపెద్ద విజయాన్ని అందుకున్న కోహ్లీ సేన...

CSK vs RCB: Chennai Super Kings failure continues in 2020 Season CRA
Author
India, First Published Oct 10, 2020, 11:40 PM IST

IPL 2020 సీజన్ 13లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడి, ఫ్లేఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది ధోనీ సేన.170 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్...20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులకే పరిమితమైంది. 37 పరుగుల తేడాతో చెన్నైపై ఐపీఎల్ చరిత్రలోనే ఘన విజయం అందుకుంది ఆర్‌సీబీ.

సీఎస్‌కే ఓపెనర్లు డుప్లిసిస్ 8, షేన్ వాట్సన్ 14 పరుగులకి అవుట్ కాగా... తొలి మ్యాచ్ ఆడుతున్న ఎన్. జగదీశన్ మంచి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 28 బంతుల్లో 4 ఫోర్లతో 33 పరుగులు చేసిన జగదీశన్ రనౌట్ కాగా, మహేంద్ర సింగ్ ధోనీ ఓ సిక్స్‌తో 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

సామ్ కుర్రాన్ డకౌట్ కాగా... అంబటి రాయుడు మరోసారి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 40 బంతుల్లో 4 ఫోర్లతో 42 పరుగులు చేసిన అంబటి రాయుడు అవుట్ కావడంతో గెలుపుపై ఆశలు వదులుకుంది సీఎస్‌కే. బ్రావో 7, రవీంద్ర జడేజా 7 పరుగులు చేసి అవుట్ అయ్యారు. దీపక్ చాహార్ 5, శార్దూల్ ఠాకూర్ 1 పరుగుతో నాటౌట్‌గా నిలిచారు. ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌లో 90 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Follow Us:
Download App:
  • android
  • ios