ఐపీఎల్ 2020 సీజన్‌లో బెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ...స్టాండ్స్‌లో నుంచి విరాట్‌ను ఫ్లైయింగ్ కిస్ ఇచ్చిన అనుష్క... చప్పట్లతో అభివాదం... 

IPL 2020 సీజన్‌లో మొదటి మూడు మ్యాచుల్లో విఫలమైన తర్వాత మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు విరాట్ కోహ్లీ. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 72 పరుగులతో కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన విరాట్, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడాడు. 52 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 90 పరుగులు చేశాడు ‘కింగ్’ కోహ్లీ. కోహ్లీ ధనాధన్ ఇన్నింగ్స్‌ను స్టేడియం నుంచి వీక్షించింది ఆయన సతీమణి అనుష్క శర్మ.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అసలు సిసలు ‘కింగ్’ ఇన్నింగ్స్ అనంతరం పెవిలియన్‌కు వస్తున్న విరాట్ కోహ్లీని చూసి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది అనుష్క శర్మ. గర్భవతి అయిన అనుష్క శర్మ ముఖంలో స్పష్టంగా మార్పు కనిపిస్తోంది. తన భార్యను చూస్తూ కళ్లతోనే నవ్వుతూ ప్రేమ అభివాదం చేశాడు విరాట్. ఈ మూమెంట్ నెటిజన్ల మనసు దోచుకుంది...

Scroll to load tweet…

 ఐపీఎల్ సీజన్ మొదట్లో విరాట్ కోహ్లీ ఫెయిల్ అయినప్పుడు, దానికి అనుష్కను కారణంగా చూపుతూ ట్రోల్స్ వచ్చిన విషయం తెలిసిందే. సునీల్ గవాస్కర్ కూడా ‘అనుష్క శర్మతో కలిసి విరాట్ కోహ్లీ చేసిన ప్రాక్టీస్ ఇక్కడ సరిపోదంటూ’ కామెంట్ చేయడం తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసందే.