CSK vs GT : బౌండ‌రీల వ‌ర్షం.. గుజ‌రాత్ బౌలింగ్ ను ర‌ఫ్ఫాడించిన ర‌చిన్ ర‌వీంద్ర‌, శివం దూబే !

Chennai Super Kings vs Gujarat Titans : న్యూజిలాండ్ యంగ్ ప్లేయ‌ర్ ర‌చిన్ ర‌వీంద్ర‌ను చెన్నై సూప‌ర్ కింగ్స్ ఐపీఎల్ 2024 మినీ వేలంలో రూ.1.80 కోట్లకు ద‌క్కించుకుంది. తాజాగా గుజ‌రాత్ తో జ‌రిగిన మ్యాచ్ లో రచిన్ రవీంద్ర తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. 
 

CSK vs GT: Rain of boundaries.. Rachin Ravindra and Shivam Dube who destroyed the Gujarat bowling! RMA

CSK vs GT : ఐపీఎల్ 2024 లో భాగంగా మంగ‌ళ‌వారం చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జ‌రిగింది. గుజ‌రాత్ పై చెన్నై టీమ్ సుప‌ర్ విక్ట‌రీ సాధించింది. దీంతో ఐపీఎల్ 2024లో వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని న‌మోదుచేసింది. ఈ సీజ‌న్ లో సీఎస్‌కే, జీటీ జట్ల మధ్య ఐపీఎల్ 7వ మ్యాచ్ జర‌గ్గా.. కెప్టెన్ శుభ్ మ‌న్ గిల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూప‌ర్ కింగ్స్ కు ఓపెన‌ర్లుగా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కీవీస్ యంగ్ ప్లేయ‌ర్ రచిన్ రవీంద్రలు జ‌ట్టుకు శుభారంభం అందించారు.

రుతురాజ్ గైక్వాడ్, ర‌చిన్ ర‌వీంద్ర‌లు దుమ్మురేపే ఆట‌తో స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించారు. అద్భుత‌మైన షాట్ల‌తో.. బౌండ‌రీలు బాదుతూ గుజ‌రాత్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు ర‌చిన్. ఐపీఎల్ 2024 మినీ వేలంలో సీఎస్కే రూ.1.80 కోట్లకు న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్రను సొంతం చేసుకుంది. వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లో అద‌రిపోయే ఇన్నింగ్స్ లు ఆడిన ఈ యంగ్ ప్లేయ‌ర్ ఇప్పుడు ఐపీఎల్ లో దుమ్మురేపుతున్నాడు.

పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ పై విరాట్ కోహ్లీ కోప్ప‌డ్డాడు... వీడియో వైరల్

గుజ‌రాత్ తో జ‌రిగిన మ్యాచ్ లో ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన రచిన్ రవీంద్ర.. ఉమేష్ యాదవ్ ఓవర్లో తొలి రెండు బంతుల్లో 6, 4తో 10 పరుగులు చేశాడు. తర్వాతి ఓవర్‌లో వరుసగా 2 ఫోర్లు బాదాడు. మళ్లీ ఉమేష్ యాదవ్ ఓవర్లో 6, 4 బౌండ‌రీలు బాదాడు. అలాగే, ఉమర్జాయ్ వేసిన‌ ఓవర్‌లో ఒక సిక్స‌రు, ఒక ఫోర్ బాదాడు. రచిన్ రవీంద్ర 20 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 46 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్‌లో 15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేశాడు.

అలాగే, యంగ్ ప్లేయ‌ర్ శివం దూబే సైతం ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో దుమ్మురేపాడు. సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డుతూ గుజ‌రాత్ బౌలింగ్ ను చిత్తుచేశాడు. దూబే త‌న 51 ప‌రుగుల ఇన్నింగ్స్ లో 2 ఫోర్లు, 5 సిక్స‌ర్లు బాదాడు. దీంతో చెన్నై సూప‌ర్ కింగ్స్ 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 206 ప‌రుగులు చేసింది. 207 ప‌రుగుల భారీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 143 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. సాయి సుద‌ర్శ‌న్ మిన‌హా మిగ‌తా ఆట‌గాళ్లు రాణించ‌లేక‌పోవ‌డంతో చెన్నై చేతితో 63 ప‌రుగుల తేడాతో గుజ‌రాత్ ఓడిపోయింది.

IND vs AUS : 3 దశాబ్దాల తర్వాత 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ షెడ్యూల్ ఇదిగో..

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios