Asianet News TeluguAsianet News Telugu

ఆర్ఆర్ పై సీఎస్కే సూప‌ర్ విక్ట‌రీ.. ప్లేఆఫ్స్ వైపు అడుగులేసిన చెన్నై సూప‌ర్ కింగ్స్

CSK vs RR: ఐపీఎల్ 2024లో 61వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. దీంతో ప్లేఆఫ్‌కు చేరుకోవాలన్న ఆ జట్టు ఆశలు సజీవంగా ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఈ సీజన్‌లో ఇది 7వ గెలుపు.
 

CSK Super Victory on RR Chennai Super Kings inching closer to the IPL 2024 playoffs  RMA
Author
First Published May 12, 2024, 7:47 PM IST

Chennai vs Rajasthan : ఐపీఎల్ 2024 లో 61వ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆఖరి హోమ్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ పై ఘ‌న విజ‌యం సాధించింది. ప్లేఆఫ్ రేసులో నిల‌వాలంటే చెన్నై టీమ్ కు త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్ లో ఈ విజ‌యం ద‌క్కింది. అలాగే, హోం గ్రౌండ్ లో చెన్నైకి ఇది చివ‌రి మ్యాచ్.. చెపాక్ లో 50వ విజ‌యాన్ని సీఎస్కే అందుకుంది. ఈ క్ర‌మంలోనే చెన్నై టీమ్ త‌మ ప్లేయ‌ర్ల‌ను ఘ‌నంగా సన్మానించింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది.

యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేక క్రీజులోకి వ‌చ్చిన వెంట‌నే పెవిలియన్‌కు చేరుకున్నారు. కెప్టెన్ సంజూ శాంసన్ 15 పరుగుల వద్ద అవుటయ్యాడు. రియాన్ పరాగ్ బాగా బ్యాటింగ్ చేసి 35 బంతుల్లో 47 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ధృవ్ జురెల్ 28 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సిమర్‌జీత్ సింగ్ అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టాడు. తుషార్ దేశ్‌పాండే రెండు వికెట్లు తీశాడు. దీంతో 20 ఓవ‌ర్ల‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 5 వికెట్లు కోల్పోయి 141 ప‌రుగులు చేసింది.  చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 18.2 ఓవర్లలో 145 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

MS DHONI : క్రికెట్ ల‌వ‌ర్స్ కు చెన్నై ప్ర‌త్యేక విజ్ఞ‌ప్తి.. ధోని రిటైర్మెంట్ కాబోతున్నాడా?

142 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన చెన్నై సూప‌ర్ కింగ్స్ ఓపెన‌ర్లు శుభారంభం అందించారు. 27 పరుగులకు ర‌చిన్ రవీంద్ర అశ్విన్‌కు చిక్కాడు. 32 పరుగుల స్కోరు వద్ద చెన్నైకి తొలి దెబ్బ తగిలింది. ఆ త‌ర్వాత వ‌రుస‌గా వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. అయితే రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడుతూ జట్టును విజయతీరాలకు చేర్చి అజేయంగా నిలిచాడు. రితురాజ్ 42 పరుగులతో నాటౌట్‌గా ఆడాడు. డారిల్ మిచెల్ (22 పరుగులు), మొయిన్ అలీ (10 పరుగులు), శివమ్ దూబే (18 పరుగులు), రవీంద్ర జడేజా (5 పరుగులు) పెద్ద ఇన్నింగ్స్ లు ఆడ‌లేక‌పోయారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు వచ్చిన సమీర్ రిజ్వీ 8 బంతుల్లో 15 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ గెలుపుతో చెన్నై టీమ్ ఐపీఎల్ పాయింట్ల ప‌ట్టిక‌లో 3వ స్థానంలోకి చేరుకుంది.

 

 

ఇదే నా చివ‌రి ఐపీఎల్.. రోహిత్ శ‌ర్మ సంచ‌ల‌న వీడియో 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios