100th Test match: ధర్మశాలలో భార‌త్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో ఐదో, చివరి మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ ఆడ‌టంతో భార‌త్ స్టార్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్వ‌న్ 100 టెస్టు మ్యాచ్ లు ఆడిన 14వ భార‌త క్రికెట‌ర్ ఘ‌న‌త సాధించాడు.   

100th Test match: ధర్మశాలలో భార‌త్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో ఐదో, చివరి మ్యాచ్ జ‌రుగుతోంది.   టీమిండియా ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకుని 3-1తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. అయితే, దీనిని 4-1తో ముగించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఈ 5వ టెస్టుతో భార‌త్ స్టార్ బౌల‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్, ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్‌స్టో ఈ మ్యాచ్ తో త‌మ 100 టెస్టును ఆడుతున్నారు. దీంతో భార‌త్ త‌ర‌ఫున 100కు పైగా టెస్టు మ్యాచ్ లు ఆడిన దిగ్గ‌జ ప్లేయ‌ర్ల స‌ర‌స‌న అశ్విన్ నిలిచాడు.

భార‌త్ త‌ర‌ఫున 100+ టెస్టు మ్యాచ్ లు ఆడిన ఎలైట్ గ్రూప్ లో ర‌విచంద్ర‌న్ అశ్విన్ చేరాడు. ఈ ఘనత సాధించిన 14వ భారతీయుడిగా అశ్విన్ నిలిచాడు. ఈ లిస్టులో స‌చిన్ టెండూల్కర్ అత్య‌ధికంగా 200 టెస్టు మ్యాచ్ ల‌ను ఆడాడు. ఆ త‌ర్వాతి స్థానంలో భార‌త మాజీ కెప్టెన్, టీమిండియా ప్ర‌ధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ (163), వీవీఎస్ లక్ష్మణ్ (134), అనిల్ కుంబ్లే (132), కపిల్ దేవ్ (131), సునీల్ గవాస్కర్ (125), దిలీప్ వెంగ్‌సర్కార్ (116), సౌరవ్ గంగూలీ (113), విరాట్ కోహ్లీ (113), ఇషాంత్ శర్మ (105), హర్భజన్ సింగ్ (103), చెతేశ్వర్ పుజారా (103)లు ఉన్నారు.

Ind vs Eng: 112 ఏళ్ల తర్వాత.. స‌రికొత్త‌ చరిత్ర సృష్టించ‌నున్న రోహిత్ సేన !

అంతర్జాతీయ క్రికెట్ లో ఇప్పటివరకు 78 మంది క్రికెటర్లు 100+  టెస్టు మ్యాచ్ లను ఆడారు. భారత్ నుంచి 14 మంది ఈ ఘనత సాధించారు. 100+  టెస్టు మ్యాచ్ లను ఆడిన ప్లేయర్ల లిస్టులో ఎక్కువ మంది ఇంగ్లాండ్ టీమ్ కు చెందిన వారు ఉన్నారు. ఇంగ్లాండ్ జట్టు నుంచి 17 మంది, ఆస్ట్రేలియా 15, భారత్ 14, వెస్టిండీస్ 9, దక్షిణాఫ్రికా 8, శ్రీలంక 6, పాకిస్తాన్ 5, న్యూజిలాండ్ 3 ప్లేయర్లు 100 టెస్టు మ్యాచ్ లను ఆడారు. గాడ్ ఆఫ్ క్రికెట్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 200 టెస్టు మ్యాచ్ లు ఆడిన ఏకైక క్రికెటర్.

 

Scroll to load tweet…

IND VS ENG: ఇంగ్లాండ్ ను కూల్చేసిన కుల్దీప్ యాదవ్ !