టీమిండియా క్రికెటర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆటగాడు.. యుజ్వేంద్ర చాహల్ ఇటీవల ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. డాక్టర్, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మను చాహల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాగా.. ధనశ్రీ వర్మకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. హీరోయిన్లను తలదన్నే అందంతో మెరిసిపోతుంది ధనశ్రీ. ఆమె అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే.

అది పక్కన పెడితే.. ఆమె చాహల్ కి భార్య కాకముందే డ్యాన్సర్ గా గుర్తింపు ఉంది. ఆమె డ్యాన్స్ వీడియోలకు చాలా క్రేజ్ ఉంది. ఈ క్రమంలోనే ఆమెకు సోషల్ మీడియాలో క్రేజ్ ఉంది. ఎప్పటికప్పుడు డ్యాన్స్ వీడియోలతో అలరించడం ధనశ్రీకి అలవాటు. ఇండియన్ క్రికెటర్ శిఖర్ ధావన్ తో కలిసి కూడా ధనశ్రీ గతంలో చిందులు వేసింది.

 

కాగా.. తాజాగా ఆమె తన తల్లి తో కలిసి ధనశ్రీ డ్యాన్స్ చేశారు. దానికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది. బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యా రాయ్ కి సంబంధించిన ‘తాల్’ పాటకు వారు స్టెప్పులేశారు. ఆ పాటలో ఇద్దరూ పసుపు రంగు దుస్తులు ధరించారు. ఇద్దరూ చూడీదార్ లే వేసుకోవడం విశేషం. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రపంచ డ్యాన్స్ డే సందర్భంగా ఈ వీడియో షేర్ చేయడం గమనార్హం. 

చాహల్ వివాహం.. డిసెంబర్ 22,2020లో చోటుచేసుకుంది. కాగా.. చాభల్ ప్రస్తుతం ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడుతున్నాడు. వారిని ధనశ్రీ ఎప్పటికప్పుడు చీర్ చేస్తూనే ఉంది. ఆర్సీబీ అన్ని మ్యాచులకీ ధనశ్రీర హాజరై.. స్టేడియంలో సందడి చేస్తూ ఉంటారు.