Cricket Australia: భారత్ లో క్రికెట్ కు ఉన్న క్రేజ్ ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి మార్కెటింగ్ సంస్థలే కాదు విదేశీ క్రికెట్ బోర్డులు కూడా వెనుకాడటం లేదు.

భారత్ లో క్రికెట్ ఓ మతం కిందే లెక్క. టీమిండియా అనామక జట్టుతో మ్యాచ్ ఆడిన చూడటానికి కోట్లాది మంది యువత సిద్ధంగా ఉన్నారు. ఒక్క భారత్ ఆడే మ్యాచులే కాదు ఇతర దేశాల మ్యాచులను కూడా ఆసక్తిగా చూడటంలో భారత క్రికెట్ అభిమానులు ముందుంటారు. ఇప్పుడు ఇదే క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) భావిస్తున్నది. ఈ మేరకు తమ దేశంలో జరిగే క్రికెట్ మ్యాచులన్నీ భారత్ లో ప్రసారం చేసేందుకు గాను ప్రముఖ సంస్థ డిస్నీ స్టార్ తో ఒప్పందం కుదుర్చుకుంది. 

2023-24 నుంచి ఏడేండ్ల పాటు డిస్నీ స్టార్ తో ఈ ఒప్పందం కుదర్చుకున్నది సీఏ. దీని ప్రకారం. 2023 నుంచి 2030 వరకు ఆస్ట్రేలియా వేదికగా జరిగే ప్రతి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లతో పాటు బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్), ఉమెన్స్ బీబీఎల్ ను కూడా డిస్నీ స్టార్ లో వీక్షించొచ్చు. ఈ మేరకు సీఏ-డిస్నీ స్టార్ లు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆసియా ఖండానికి గాను ఈ హక్కులను డిస్నీ స్టార్ దక్కించుకుంది. 

Scroll to load tweet…

ప్రస్తుతం (2018 నుంచి) సోనీ నెట్‌వర్క్ వద్ద సీఏ బ్రాడ్కాస్టింగ్ హక్కులున్నాయి. 2018 నుంచి సోనీ ఛానెళ్లు ఆసీస్ లో జరుగుతున్న మ్యాచులను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. ఇదిలాఉండగా తాజా ఒప్పందంపై సీఏ హర్షం వ్యక్తం చేసింది. 

క్రికెట్ క్రేజ్ ఉన్న భారత్ లో ఆసీస్ ఆడబోయే మ్యాచులకు మరింత ఆదరణ పెరుగుతుందని ఈ మేరకు తాజా ఒప్పందం దోహదం చేస్తుందని సీఏ సీఈవో నిక్ హాక్లీ ఓ ప్రకటనలో తెలిపారు.

Scroll to load tweet…

ఇటీవలే ముగిసిన ఐపీఎల్ మీడియా హక్కుల వేలంలో కూడా టీవీ ప్రసార హక్కులను స్టార్ దక్కించుకున్న విషయం తెలిసిందే. భారీ ధర (రూ.23.575) పెట్టి స్టార్ తిరిగి వీటిని సొంతం చేసుకుంది. అయితే డిజిటల్ హక్కులు మాత్రం వయాకామ్, టైమ్స్ ఇంటర్నెట్ కు దక్కాయి. మొత్తంగా ఈ ప్రక్రియ ద్వారా బీసీసీఐకి రూ. 48,390 కోట్ల ఆదాయం వచ్చింది.