క్రికెట్ ఆట ఎంత సీరియస్ గా సాగినా... మధ్య మధ్యలో కొన్ని సరదా సన్నివేశాలు జరుగుతూనే ఉంటాయి. ఓ జట్టు క్రికెటర్లు.. మరో జట్టు సభ్యలను ఎక్కిరించడమో.. లేదా.. వికెట్ తీసిన ఆనందంలో పరుగులు తీయడం లాంటివి జరుగుతుంతాయి. కొందరు ప్లేయర్లు.. తమ తోటి క్రికెటర్లను, అంపైర్లను సరదాగా ఆటపట్టిస్తుంటారు కూడా. అయితే... తాజాగా... ఓ ఆటలో అంపైర్ క్రికెటర్లను ఆటపట్టించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇంతకీ మ్యాటరేంటంటే... బిగ్‌బాష్‌ లీగ్‌లో భాగంగా మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌, అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. 17వ ఓవర్‌లో రషీద్‌ ఖాన్‌ వేసిన మూడో బంతి మెల్‌బోర్న్‌ బ్యాట్స్‌మన్‌ వెబ్‌స్టర్‌ షాట్ ఆడగా.. బంతి కాస్త అతని ప్యాడ్‌లకు తగిలింది. వెంటనే ఎల్బీడబ్ల్యూ కోసం రషీద్‌ అప్పీలు చేశాడు. అంపైర్‌ గ్రెగ్ డేవిడ్సన్‌ ఔట్‌గా వేలు పైకెత్తి.. వెంటనే తన ముక్కుని రుద్దుకున్నాడు.

అంపైర్‌ నిర్ణయాన్ని పూర్తిగా గమనించని అడిలైడ్‌ ఆటగాళ్లు సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారు. రషీద్‌ సహచర ఆటగాళ్లతో సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. వెంటనే ఆటగాళ్లకు అంపైర్‌ సైగ చేసాడు. 'నేను ఔట్‌ అని ప్రకటించలేదు, కేవలం నా ముక్కుని రుద్దుకున్నా' అని సైగలు చేసాడు. అంపైర్‌ చేసిన సరదా పనికి ఆటగాళ్లు ఆశ్చర్యపోయారు.

కాగా... దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. నెటిజన్లు ఈ వీడియోకి విపరీతంగా స్పందిస్తున్నారు.  ఇలాంటి ఫన్నీ అంపైర్ ని చూడలేదంటూ కామెంట్స్ చేయడం విశేషం.