Asianet News TeluguAsianet News Telugu

రాజకీయాల్లోనే కాదు క్రికెట్ లోనూ ఓ నితీష్ కుమార్ ... ఇద్దరూ జంపింగ్ జపాంగ్ లే..!!

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, యూఎస్ఐ క్రికెటర్ నితీష్ కుమార్ ల పేర్లే కాదు ఇద్దరి వ్యవహారతీరు ఒకేలా వుంది. దీంతో వీరిద్దరిని పోలుస్తూ ఆసక్తికర ట్రోల్స్, మీమ్స్ బయటకు వస్తున్నాయి. 

Comparison of USA Cricketer Nitish to Bihar CM Nitish Kumar AKP
Author
First Published Jun 14, 2024, 1:29 PM IST

రాజకీయ నాయకులు పార్టీలు మారడం తరచూ చూస్తుంటాం. తమ రాజకీయ ఎదుగుదల కోసం కొందరు, పదవులను ఆశించి మరికొందరు పార్టీలు మారుతుంటారు. ఇలా పార్టీలు మారడం కాదుగానీ రాజకీయ అవసరాల కోసం ఎవరితోనైనా జతకట్టే నాయకులు కొందరున్నారు. ఇలా జంపింగ్ నాయకుల్లో బిహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్ యునైటెడ్ (JDU) అధినేత నితీష్ కుమార్ ఒకరు. ఆయన ఎప్పుడు ఎవరితో వుంటారో... ఎప్పుడు జంప్ అవుతారో ఎవరికీ తెలియదు. ఓసారి బిజెపి నేతృత్వంలోని ఎన్డిఏ కూటమిలో... మరోసారి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమిలో వుంటారు. దీంతో దేశంలో నిలకడలేని రాజకీయ నేతల్లో నితీష్ కుమార్ ప్రథముడిగా పేర్కొంటారు. 

అయితే రాజీయాల్లోనే క్రికెట్ లోనూ ఇలాంటి నితీష్ కుమార్ ఒకరున్నారట. ఈయన పార్టీలు మారితే ఆయన టీమ్ లు మారుతున్నాడట. ప్రస్తుతం ఐసిసి టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీకి యూఎస్ఐ ఆతిథ్యం ఇస్తోంది. అయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్టు ఈ వరల్డ్ కప్ లో అద్భుత ప్రదర్శనతో అదరగొడుతోంది. దీంతో ఆ టీం ఆటగాళ్లకు గుర్తింపు లభిస్తోంది... ఇలాంటి వారిలో భారత సంతతికి చెందిన యూఎస్ఐ ఆటగాడు నితీష్ రోయినిక్ కుమార్ ఒకరు. ఇతడు ఆటతీరు కంటే వ్యవహారతీరుతోనే బాగా ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా గతంలో కెనడా తరపున ఆడిన ఇతడు ప్రస్తుతం అమెరికా తరపున ఆడుతున్నాడు. ఈ రెండు జట్ల మధ్య తరచూ మారుతుంటాడు నితీష్. దీంతో ఇతడితో బిహార్ సీఎం నీతిష్ కుమార్ ను పోలుస్తూ రాజకీయ ప్రత్యర్థులు ట్రోల్ చేస్తున్నారు. 

బిహార్ సీఎం నితీష్ కుమార్ : 

జనతాదళ్ (యునైటెడ్) అధినేత, బిహార్ సీఎం నితీష్ కుమార్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకువచ్చేది పొలిటికల్ జంపింగ్స్. తనకు అవసరమైతే ఏ పార్టీలో అయినా కలవడం... అవసరం లేదంటే అక్కున చేర్చుకున్న పార్టీని కూడా ఎడమకాలితో తన్నడం ఇతడి నైజం. దీంతో రాజకీయాల్లో విశ్వసనీయత లేని నేతలకు ఉదాహరణగా నితీష్ మారారు. 

గత పదేళ్లలో నితీష్ ఐదుసార్లు కూటములను మారారు. మొదట 2013 లో సుధీర్ఘకాలం కొనసాగిన ఎన్డిఏ నుండి బయటకు వచ్చారు. అప్పటినుండి ఆయన జంపింగ్ జపాంగ్ స్టోరీ ప్రారంభమయ్యింది. ఎన్డిఏ తరపున ప్రధాని పదవి ఆశించి భంగపడ్డ నితీష్ ప్రత్యర్ధి కూటమిలో చేరిపోయాడు. 

2015 లో నితీష్ కాంగ్రెస్, ఆర్జెడిలతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసారు. ఈ ఎన్నికల్లో ఆర్జేడి అత్యధిక సీట్లు సాధించినా రాజకీయ సమీకరణల దృష్ట్యా నితీష్ కుమార్ సీఎం అయ్యారు.  అయితే రెండేళ్లకే ఈ కూటమిని వదిలి తిరిగి ఎన్డిఏలో చేరిపోయారు నితీష్. 

2017 తిరిగి ఎన్డిఏ గూటికి చేరిన నితీష్ మోదీ హవాను సంపూర్ణంగా వాడుకున్నాడు. దీంతో 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జెడికి అత్యధిక సీట్లు సాధించినా బిజెపితో కలిసి నితీష్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసాడు. 

అయితే 2022 లో మరోసారి నితీష్ ఎన్డిఏ కు గుడ్ బై చెప్పాడు. ఆర్జెడితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసాడు. లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమిలోనూ కీలకంగా వ్యవహరించారు.

అయితే ఇండి కూటమిలోనూ ఆయనకు ప్రధాని అవకాశం రాకపోవడంతో 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు మళ్లీ ఎన్డిఏలో చేరిపోయాడు. ప్రస్తుతం ఆయన ఎన్డిఏలో కీలక భాగస్వామి. బిజెపికి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో నితీష్ కుమార్ కీలకంగా మారారు. 

క్రికెటర్ నితీష్ కుమార్ : 

యునైటెడ్  స్టేట్స్ ఆఫ్ అమెరికా క్రికెటర్ నితీష్ కుమార్ మొదట కెనడా నుండి అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టాడు. అతి చిన్న వయసులోనే క్రికెట్ లో అడుగుపెట్టాడు... కేవలం 15 ఏళ్లకే వన్డే క్రికెటర్ గా  మారాడు. కెనడా తరపున అతడు అంతర్జాతీయ మ్యాచులు ఆడాడు. 

అయితే నితీష్ కెనడా నుండి క్రికెట్ కెరీర్ ప్రారంభించి ప్రస్తుతం యూఎస్ఐ టీంలో ఆడుతున్నాడు. అతడు తరచూ యూఎస్ఐ నుండి కెనడాకు... కెనడా నుండి యూఎస్ఐ కు మారుతుంటాడు. కెనడా అండర్ 15, అండర్ 19 తో అమెరికా అండర్ 15 లో టీంలో కూడా ఆడారు. ఇక కొంతకాలం కెనడా క్రికెట్ టీం కెప్టెన్ గా వ్యవహరించిన నితీష్ ప్రస్తుతం అమెరికా జట్టులో కొనసాగుతున్నారు. అతడు ఐసిసి టీ20 వరల్డ్ కప్ ఆడుతున్న యూఎస్ఐ జట్టులో కూడా ఆడుతున్నాడు. 

ఇద్దరు నితీష్ లపై సెటైర్లు : 

ఇలా బిహార్ సీఎం నితీష్ కుమార్ కూటములు మారుతుంటే క్రికెటర్ నితీష్ జట్లు మారుతున్నాడు. దీంతో ఈ ఇద్దరిని పోలుస్తూ సెటైర్లు, ట్రోలింగ్స్ పెరిగిపోయాయి. బిహార్ సీఎం రాజకీయ ప్రత్యర్థులే కాదు మీమర్స్ కూడా ఇద్దరు నితీష్ లను పోలుస్తూ కామెంట్స్ చేస్తున్నారు.   

 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios