గాల్వాన్ లోయలో చైనా దురాగతానికి వ్యతిరేకంగా, చైనా దుష్టనీతిని నిరసిస్తూ చైనా వస్తువుల బహిష్కరణ నినాదం ఊపందుకున్న విషయం తెలిసిందే. దీనితో సోషల్ మీడియాలో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ వివోపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో వివో స్వచ్చంధంగా ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ గా తప్పుకుంది. 

చైనాకు చెందిన యాప్ లపై ప్రభుత్వం నిషేధం విధించుకుంటూ పోతుంటే.... బీసీసీఐ మాత్రం వివోనే కొనసాగించడానికి నిశ్చయించుకుంది. ఈ నేపథ్యంలోనే తీవ్ర దుమారం చెలరేగడం, ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇది మరింతగా ఎక్కువవడంతో వివో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలియవస్తుంది. 

అయితే బీసీసీఐ మాత్రం ఇంకా వివో తప్పుకోవడాన్ని అంగీకరించలేదని తెలియవస్తుంది. ప్రస్తుతానికి వీరి మధ్య చర్చలు సాగుతున్నట్లు సమాచారం. ఇటీవల భారత ప్రభుత్వం చైనా దేశానికి సంబంధించి 59 యాప్లను నిషేధించిన సంగతి కూడా విదితమే. ఇలాంటి నేపథ్యంలో ఐపీఎల్‌ స్పాన్సర్ గా వివో సంస్థ స్వచ్ఛందంగా స్పాన్సర్ షిప్ నుండి తప్పుకోవడానికి సిద్ధమైంది. 

2018లో హక్కుల కోసం వివో 2,199 కోట్లను బీసీసీఐకి చెల్లించింది. అంటే ఒక్కో సంవత్సరానికి 440 కోట్లను సరాసరిగా చెల్లిస్తుంది. బీసీసీఐకి ఏకంగా ఆరెస్సెస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్ వంటి సంస్థల నుంచే బెదిరింపులు ఎదురయ్యింది నేపథ్యంలో వివో తప్పుకోవడమే కరెక్ట్ అని భావించింది.