బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పూజారా వేలికి గాయం...ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్‌కి రాని పూజారా...రెండో ఇన్నింగ్స్‌లో పూజారా బదులు మయాంక్ బరిలో దిగే అవకాశం...
ఇంగ్లాండ్‌పై మంచి ఆధిక్యం కనబరుస్తున్న రెండో టెస్టులో టీమిండియాకు షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గాయపడిన కారణంగా భారత బ్యాటింగ్ లైనప్‌లో కీలకమైన ఛతేశ్వర్ పూజారా... ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్‌కి రాలేదు. అతని స్థానంలో మయాంక్ అగర్వాల్ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా వ్యవహరిస్తున్నాడు.
తొలి ఇన్నింగ్స్‌లో పూజారా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతని వేలికి గాయమైంది. దీంతో పూజారా ఫీల్డింగ్‌కి రావడం లేదని తెలిపింది టీమిండియా. తొలి ఇన్నింగ్స్‌లో 58 బంతుల్లో 2 ఫోర్లతో 21 పరుగులు చేసి జాక్ లీచ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు పూజారా. పూజారా కోలుకోకపోతే అతని స్థానంలో మయాంక్ అగర్వాల్ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది.
రోహిత్ శర్మ 161, రహానే 67, రిషబ్ పంత్ 58 పరుగులతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకి ఆలౌట్ అయ్యింది టీమిండియా. ఇంగ్లాండ్ 52 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినా ఓల్లీ పోప్, బెన్ ఫోక్స్ కలిసి ఆరో వికెట్‌కి 30 పరుగుల భాగస్వామ్యం జోడించి, తమ జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు.
