Champions Trophy 2025: పాకిస్థాన్‌కు భార‌త్ షాక్..

Champions Trophy 2025: ఒక దేశం తన జట్టును పంపడానికి నిరాకరిస్తే, ఐసీసీ ఏకపక్ష నిర్ణయాలకు దూరంగా ఉండాలని నొక్కిచెప్పిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) భద్రతా సమస్యలపై గట్టి వైఖరిని తీసుకుంది. అయితే, మన క్రికెటర్లను పాక్ కు పంపడంపై బీసీసీఐ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. 
 

Champions Trophy 2025: India shocks Pakistan, BCCI leans towards not sending Indian Team to Pakistan RMA

Champions Trophy 2025-Indian Team:  పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు భార‌త్ షాక్ ఇవ్వ‌నుందా? ఒక ఐసీసీ మెగా టోర్నీని నిర్వ‌హించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) నిర్ణ‌యంతో త‌ల‌నొప్పులు త‌ప్ప‌వా? అనే అంశం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకు అనుకుంటున్నారా? అదే, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తో ముడిప‌డి ఉన్న అంశం. దుబాయ్ లోని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రధాన కార్యాలయంలో ఇటీవల జరిగిన ఒప్పందంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్య హక్కులను దక్కించుకుంది.

పీసీబీ చీఫ్ జకా అష్రఫ్, ఐసీసీ జనరల్ కౌన్సెల్ జొనాథన్ హాల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే, ఈ టోర్నమెంట్ కోసం భారత జట్టు పాకిస్థాన్ పర్యటనకు వెళ్లే అవకాశం లేనందున అందరి దృష్టి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పైనే ఉంది. పాక్ లోని భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. అంత‌కుముందు ఆసియా కప్ 2023లో పాల్గొనేందుకు భారత జట్టు దూరంగా ఉండాల‌ని నిర్ణయం తీసుకుంది.  దీంతో పాకిస్థాన్ హైబ్రిడ్ పద్ధతిలో ఈ  టోర్నీకి ఆతిథ్యమిచ్చింది.

జకా అష్రఫ్, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వైస్ చైర్మన్ ఖలీద్ అల్ జరూనీ మధ్య ఇటీవల జరిగిన చర్చలు భారత్ పాక్ లో నిర్వహించే టోర్నీలో పాల్గొనకూడదని నిర్ణయించుకుంటే కొన్ని ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్ ల‌ను యూఏఈకి తరలించడంపై ప్రశ్నలు లేవనెత్తాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గురించి వారి సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించనప్పటికీ, క్రికెట్ ఈవెంట్లకు ఆతిథ్యం ఇవ్వడంలో పాకిస్తాన్ తో కలిసి పనిచేయడానికి యూఏఈ ఈ అభిప్రాయం వ్య‌క్తం చేసింద‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

YEAR ENDER 2023: ఈ ఏడాది గ్రౌండ్ ను షేక్ చేసిన విరాట్ కోహ్లీ అద్భుతమైన‌ ఇన్నింగ్స్ ఇవే..

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios