దుబాయ్‌లో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆదివారం భారత్, పాక్ తలపడనున్నాయి.

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్‌ను ఓడిస్తామని పాకిస్థాన్ పేసర్ హరీస్ రౌఫ్ ధీమాగా చెప్పాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత మహ్మద్ రిజ్వాన్ నేతృత్వంలోని జట్టు ఫిబ్రవరి 20న కరాచీ నుంచి దుబాయ్‌కి చేరుకుంది.

ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ కోసం స్టేడియం నిండిపోతుందని అంచనా. మ్యాచ్ ప్రారంభానికి మూడు వారాల ముందే టిక్కెట్లన్నీ అమ్ముడయ్యాయి. గత ఏడాది టీ20 ప్రపంచ కప్‌లో భారత్, పాక్ చివరిసారిగా తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత్ ఆరు పరుగుల తేడాతో గెలిచింది. ఇప్పుడు మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఈ రెండు జట్లు తలపడబోతున్నాయి.

ఈ మెగా టోర్నీలో మ్యాచ్ ప్రారంభానికి ముందే హరీస్ రౌఫ్ తన మాటలతో వేడి పుట్టించాడు. దుబాయ్‌లో పాకిస్థాన్ ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా మాట్లాడుతూ.. టీ20 ప్రపంచ కప్ 2021, ఆసియా కప్ 2022లో భారత్‌పై గెలిచిన విజయాల నుంచి స్ఫూర్తి పొందుతామని చెప్పాడు.

అయితే, దుబాయ్‌లోని పరిస్థితులపైనే తమ ఆట ఆధారపడి ఉంటుందని రౌఫ్ అన్నాడు. "ఖచ్చితంగా ఇది మాకు నమ్మకాన్నిస్తుంది. గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ భారత్‌ను ఓడించాం. ఆ మ్యాచ్‌లలో చేసిన మంచి పనులనే మళ్లీ చేసి భారత్‌ను ఓడించడానికి ప్రయత్నిస్తాం. ఇది మంచి మ్యాచ్ అవుతుందని ఆశిస్తున్నా" అని హరీస్ రౌఫ్ చెప్పాడు.

"రికార్డులు బాగానే ఉన్నాయి. కానీ పిచ్‌ల మీద ఆధారపడి ఉంటుంది. స్పిన్ ట్రాక్ కూడా ఉండొచ్చు. పరిస్థితులను చూసి వాటిని బాగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తాం." అని రౌఫ్ తెలిపాడు.

View post on Instagram

టీ20 ప్రపంచ కప్ 2021లో భారత్, పాక్ మ్యాచ్ దుబాయ్‌లో జరిగింది. కోవిడ్-19 కారణంగా టోర్నమెంట్ భారతదేశం నుండి దుబాయ్‌కి మార్చారు. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిచి ప్రపంచ కప్‌లో (టీ20, వన్డే కలిపి) భారత్‌పై తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆసియా కప్ 2022లో పాకిస్థాన్ సూపర్ 8 దశలో ఐదు వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది.

‘ప్రెజర్ లేదు’: హరీస్ రౌఫ్

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయిన పాకిస్థాన్.. టైటిల్ నిలబెట్టుకోవాలంటే భారత్‌తో జరిగే మ్యాచ్‌లో గెలవాల్సి ఉంది. అయితే, జట్టులో ఎలాంటి ఒత్తిడి లేదని, ప్రతి మ్యాచ్‌ను ముఖ్యమైనదిగా భావిస్తున్నామని హరీస్ రౌఫ్ చెప్పాడు.

భారత్‌తో జరిగే మ్యాచ్‌లో తమ పూర్తి సత్తా చాటుతామని అన్నాడు. "మాకు ఎలాంటి ఒత్తిడి లేదు. అందరూ రిలాక్స్‌గా ఉన్నారు. ఈ మ్యాచ్‌ను సాధారణ మ్యాచ్‌లాగే చూస్తాం. ఆటగాళ్లంతా పాజిటివ్‌గా ఉన్నారు. బాగా ఆడటానికి ప్రయత్నిస్తారు" అని పాకిస్థాన్ పేసర్ చెప్పాడు. "మాకు ప్రతి మ్యాచ్ ముఖ్యం. అందరూ తమ శక్తి మేరకు ప్రయత్నిస్తారు. మూడు విభాగాల్లోనూ బాగా ఆడి ఈ మ్యాచ్ గెలవడానికి ప్రయత్నిస్తాం" అని రౌఫ్ తెలిపాడు.

భారత్‌తో జరిగే మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఫఖర్ జమాన్ వెన్నునొప్పి కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో ఇమామ్-ఉల్-హక్‌ను జట్టులోకి తీసుకున్నారు.