Asianet News TeluguAsianet News Telugu

'నేను నా గర్ల్‌ఫ్రెండ్ ను తీసుకురావచ్చా?'.. సునీల్ నరైన్‌-గౌతమ్ గంభీర్ మొద‌టి చాట్‌లో ఇలా..

Cricket : వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండ‌ర్ సునీల్ న‌రైన్ పై గౌత‌మ్ గంభీర్ ప్రశంసలు కురిపించడం కేకేఆర్ విజయానికి అత‌ను చేసిన కృషిని నొక్కిచెబుతుంది. వీరి మధ్య ఉన్న ప్రత్యేక సంబంధాన్ని వివ‌రించిన గంభీర్.. ఐపీఎల్ ప్రారంభంలో వీరిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన మొద‌టి చాట్ వైర‌ల్ గా మారింది.
 

Can I bring my girlfriend?.. Sunil Narine's first chat with Gautam Gambhir's shocking questions.. RMA
Author
First Published May 30, 2024, 8:19 PM IST

Sunil Narine girlfriend - Gautam Gambhir : ఐపీఎల్ 2024 అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఫైనల్‌లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ను చిత్తుచేసి కోల్‌కతా నైట్ రైడర్స్ ఛాంపియ‌న్ గా నిలిచింది. ఈ క్ర‌మంలోనే కేకేఆర్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండ‌ర్ సునీల్ న‌రైన్ పై కేకేఆర్ మెంటర్ అయిన గౌతమ్ గంభీర్ ప్రశంస‌లు కురిపించాడు. ఐపీఎల్ 2024లో 'మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్స‌గా నిలిచిన న‌రైన్.. 488 పరుగులు చేయడంతో పాటు 17 వికెట్లు కూడా పడగొట్టి కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

2012, 2014 ఐపీఎల్ విజయాల సమయంలో కేకేఆర్ కెప్టెన్‌గా ఉన్న గంభీర్.. త‌న జట్టులో సునీల్ నరైన్ తొలి రోజులను గుర్తు చేసుకుంటూ చేసిన వ్యాఖ్య‌లు ప్రస్తుతం వైర‌ల్ గా మారాయి. స్పోర్ట్స్‌కీడాకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్.. నరైన్ తో కొన‌సాగిన‌ ప్రయాణం గురించి వివ‌రించాడు. సునీల్ నరైన్ తో మంచి సంబంధాలు అంటే అన్న‌ద‌మ్ముల వంటి అనుబంధం ఉంద‌ని చెప్పాడు. "నేను,  నరైన్ ఒకే విధమైన స్వాభావం, మా భావోద్వేగాలు ఒకే విధంగా ఉంటాయి" అని జైపూర్‌లో తమ మొదటి ఐపీఎల్ విజ‌యాన్నిగుర్తుచేసుకుంటూ గంభీర్ అన్నాడు.

వార్నీ ఏంది మామా ఇది.. ధోనితో పాటు మోడీ, అమిత్ షాలు కూడా ఆ పదవి కోసం పోటీ పడుతున్నారు.. !

అలాగే, "2012లో నరైన్ తొలిసారిగా ఐపీఎల్‌లోకి వచ్చినప్పుడు జైపూర్‌లో ఉన్నాము.. మేము ప్రాక్టీస్‌కు వెళ్తున్నామని, లంచ్‌కు రమ్మని చెప్పానని నాకు ఇప్పటికీ గుర్తుంది. లంచ్‌లో ఒక్క మాట కూడా మాట్లాడని న‌రైన్ చాలా సిగ్గుపడుతూ ఉన్నాడు. చివరికి అతను అడిగిన మొదటి ప్రశ్న, 'నేను నా గ‌ర్ల్ ఫ్రెండ్ ను ఐపీఎల్ కు తీసుకురావ‌చ్చా? అని అడిగాడని" గంభీర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చెశాడు. నరైన్ సిగ్గు క్రమంగా త‌మ‌ లోతైన స్నేహంగా ఎలా మారింద‌నే విష‌యాల గురించి కూడా గంభీర్ మాట్లాడాడు.

"మొదటి సీజన్‌లో అతను చాలా సైలెంట్ గా ఉన్నాడు, కానీ ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడవచ్చు. అతను నాకు సోదరుడి లాంటివాడు' అని గంభీర్ వ్యాఖ్యానించాడు. సంవత్సరాలుగా వారు అభివృద్ధి చేసుకున్న బలమైన బంధాన్ని నొక్కిచెప్పాడు, ఇది కేవలం స్నేహం.. జట్టు కు చేసిన కృషికి మించిన‌ద‌ని చెప్పాడు. "నేను నరైన్ ను స్నేహితుడిగా చూడను, సహచరుడిగా చూడను, నేను అతనిని సోదరుడిగా చూస్తాను. నాకు అతను అవసరమైతే లేదా అతనికి నేను అవసరమైతే, మేము కేవలం ఒక కాల్ దూరంలో ఉన్నామని నేను భావిస్తున్నాను, అది మనం నిర్మించుకున్న బంధం. మేము పెద్దగా ఉద్వేగానికి లోనుకాము, ఎక్కువ భావోద్వేగాలు ప్రదర్శించము, మేము ఆడంబరంగా లేము, మేము పని చేసుకుంటాము.. "అని గంభీర్ వివరించాడు.

 

 

T20 World Cup 2024 : టీమిండియా మ్యాచ్‌లు ఏ సమయంలో జరుగుతాయి?

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios