2021 ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లుగా జోస్ బట్లర్, బెన్ స్టోక్స్ వ్యవహారించబోతున్నారు. అయితే ఈ సీక్రెట్‌ను బయటపెట్టింది రాయల్స్ జట్టు కాదు, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్.

ఇయాన్ మోర్గాన్, బెన్ స్టోక్స్, బట్లర్ ఇంగ్లాండ్ జట్టుకు చెందినవాళ్లు కావడంతో, తమ జట్టు ప్లాన్ గురించి ముందే తమ వన్డే, టీ20 కెప్టెన్‌కి చెప్పేశారు ఈ ఇద్దరూ...

‘బట్లర్, బెన్ స్టోక్స్ ఓపెనర్లుగా రాబోతున్నారు. ఇద్దరు సూపర్ స్టార్ ప్లేయర్లు ఓపెనింగ్ చేస్తుంటే, చూడడానికి గొప్పగా ఉంటుంది. అయితే ప్రత్యర్థి జట్టు కెప్టెన్‌గా వారిని త్వరగా అవుట్ చేసేందుకు ఏ బౌలర్‌ను వాడాలని నేను ఆలోచించాలి... ’ అంటూ కామెంట్ చేశాడు మోర్గాన్...

సీజన్ ఆరంభానికి ముందే తమ సీక్రెట్ బయటికి రావడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ ప్లాన్‌లో ఏమైనా మార్పులు చేస్తుందేమో చూడాలి...