టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పింక్ బాల్ టెస్టు మ్యాచ్ లో అదరగొడుతోంది.  తొలి ఇన్సింగ్స్ లో  భారత్ 244 పరుగులు చేయగా.. ఆ తర్వాత బ్యాటింగ్ కి దిగిన ఆసిస్ జట్టు 191 స్కోర్ కే ఆల్ అవుట్ అయ్యింది. రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్ తన బౌలింగ్ తో బెంబేలెత్తించారు.

మరోవైపు విరాట్ కోహ్లీ ఈ టెస్టు తర్వాత భారత్ కు బయలుదేరి వెళ్లనున్నారు. ఆయన భార్య, బాలీవుడ్ దివా అనుష్క శర్మ ప్రస్తుతం గర్భిణీ అన్న విషయం తెలిసిందే. ఆమె కోసమే విరాట్ భారత్ వెళ్లనున్నారు. అయితే.. అనుష్క  డెలివరీ ఆస్ట్రేలియాలో జరిగితే బాగుంటుందని ఆసిస్ మాజీ పేసర్ బ్రెట్ లీ పేర్కొన్నారు.

అనుష్క శర్మ జనవరిలో ప్రసవించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తొలి టెస్టు తర్వాత కోహ్లీ భారత్్ కు వచ్చేస్తున్నాడు. ఇప్పటికే బీసీసీఐ అతనికి పితృత్వపు సెలవలు మంజూరు చేసింది. దాంతో మిగిగలిన మూడు టెస్టులకు రహానే సారథ్యం వహించనున్నారు.

కానీ.. ఈ టెస్టు మ్యాచ్ లు కోహ్లీ ఆడాలని ఆసీస్ అభిమానులు, మాజీ క్రికెటర్లు కోరుకుంటున్నారు. కొందరైతే ేఅసలు అనుష్క ఆస్ట్రేలియాలోనే బిడ్డను కంటే బాగుండని భావిస్తున్నారు. తాజాగా.. బ్రెట్ లీ విరుష్క జోడికి ఓ విన్నపం తెలియజేశాడు.

కోహ్లీ.. మీకు ఇష్టమైతే ఆస్ట్రేలియాలో మీ బిడ్డకు మేం స్వాగతం చెబుతాం. ఎందుకంటే మేం మిమ్మల్ని అంగీకరిస్తున్నాం. మీకు మగ బిడ్డ పుట్టినా.. ఆడ బిడ్డ పుట్టినా మాకు సంతోషమే.. అని బ్రెట్ లీ మీడియాతో పేర్కొన్నారు.